Monday, April 29, 2024
- Advertisement -

బండి సంజయ్ కన్నీళ్లు.. తప్పించుకునేందుకే అంటున్న టి‌ఆర్‌ఎస్!

- Advertisement -

ఇటీవల తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎంతటి సంచలనం అయిందో అందరికీ తెలిసిందే. పక్కా ప్రణాళికబద్దంగా బీజేపీ ఎత్తులను చిత్తు చేస్తూ గులాబీ బాస్ కమలదళానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఈ వ్యవహారం తెరపైకి రాకముందు దూకుడుగా వ్యవహరించిన బీజేపీ.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పీకపైకి రావడంతో సైలెంట్ అయిపోయింది. ఈ వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికి.. ఆడియో టేప్ రికార్డింగ్ లు, వీడియో టేప్ లు టి‌ఆర్‌ఎస్ బయటపెట్టడంతో తెలంగాణ బీజేపీ నేతలు ఉక్కృబిక్కిరి అవుతున్నారు. ఇక ఈ వ్యవహారాన్నంతటికి వెనుక నుంచి నడిపించిన అదృశ్య శక్తినే బయటకి లాగేందుకు తెలంగాణ ప్రభుత్వం సిట్ అధికారులకు ఈ కేసు అప్పగించిన సంగతి తెలిసిందే. .

ఇక ఈ కేసు లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేయగా.. ఈ నెల 21న ఆయన విచారణకు హాజరు కావాల్సిఉంది. అయితే ఆయన హాజరు కాకపోవడంతో ఈ సారి ఇ- మెయిల్ ద్వారా నోటీసులు పంపించాలని హైకోర్టు సూచిస్తూ.. ఈ నెల 30కి ఈ కేసు విచారణను వాయిదా వేసింది. ఇదిలా ఉంచితే బీఎల్ సంతోష్ కు నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ బీజేపీ బాస్ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు. బీఎల్ సంతోష్ ఏం తప్పు చేశాడో చెప్పాలని, కే‌సి‌ఆర్ అనవసరంగా టార్గెట్ చేస్తే బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరంటూ హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. అయితే బండి సంజయ్ కంటతడి పెట్టుకోవడంపై టి‌ఆర్‌ఎస్ నేతలు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. సి‌ఎం కే‌సి‌ఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితా మాట్లాడుతూ.. తప్పు చేసినవాళ్లే భయపడతారని, మీరు తప్పు చేయనప్పుడు మీకేందుకు భయం అంటూ చెప్పుకొచ్చారు. బీఎల్ సంతోష్ ఎందుకు విచారణకు హాజరు కావడం లేదో చెప్పాలంటూ ఆమె డిమాండ్ చేశారు. తాము విచారణకు హాజరు కావాలి కానీ బీజేపీ వాళ్ళు విచారణకు హాజరు కారా ? ఇదెక్కడి న్యాయం అంటూ మండి పడ్డారు. తప్పు లేనప్పుడు బండి సంజయ్ కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని, ఆయన ఎందుకు ఏడ్చరో అర్థం కావడం లేదని కవిత చెప్పుకొచ్చారు. మొత్తాని తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగులు రచ్చ తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతూ చివరికి ఎక్కడ నిలుస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

బాబుకు మోడీ పిలుపు.. కారణం ఆదేనా ?

పవన్ ప్లాన్ అదుర్స్?

ఈసారి డౌటే.. అమిత్ షా వ్యూహాలు ఫలిస్తాయా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -