షాకింగ్‌ వీడియో: అవసరాల శ్రీనివాస్‌ అసలు రూపం ఇదేనా..?

- Advertisement -

అవసరాల శ్రీనివాస్‌… టాలీవుడ్‌కి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. నటుడిగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న అవసరాల ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నాడు. ఆయనకు సంబంధించిన వీడియో ఒక సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అతని దగ్గర మూడేళ్లు కోడైరెక్టర్‌గా పనిచేసిన మహేశ్‌ అనే వ్యక్తి ఈ వీడియో బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది. మహేశ్‌కి, అవసరాలకు ఇటీవల గొడవ జరిగింది. దీంతో మహేశ్‌ని తన ఆఫీస్‌ని నుం​చి బయటకు పంపించేశాడు.

అయితే తనను అవమానించి అవసరాలను బండారం మొత్తం బయటపెడుతూ.. ఆఫీస్‌కి వెళ్లి రచ్చ రచ్చ చేసిన మహేష్.. అవసరాల రియల్ ఫేస్‌ను వీడియోలో చూపించి షాక్ ఇచ్చాడు. సినిమాల్లో అవ‌స‌రాల శ్రీనివాస్ ఎక్కువగా క‌ర్లీ హెయిర్‌తో క‌నిపిస్తుంటాడు. అత‌నికి బ‌ట్ట‌త‌ల ఉంద‌నే విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికి తెలియ‌దు. మహేశ్‌ షేర్ చేసిన వీడియోతో అవ‌స‌రాల అస‌లు రూపం బ‌య‌ట‌ప‌డింది. అయితే ఈ వీడియో బయటకు వెళ్తే.. నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా అని మహేశ్‌ని అవసరా బెదిరించాడు.

- Advertisement -

వీడియో తీస్తూ ఆఫీస్‌లోకి వెళ్లిన మహేశ్‌పై శ్రీనివాస్‌ ఫైర్‌ అయ్యాడు. ఏయ్ నువ్వెందుకు వచ్చావ్ ఇక్కడికి అని.. అవసరాల శ్రీనివాస్ బూతులు తిడుతూ కనిపించగా.. నేను మూడేళ్లుగా మీ దగ్గర కష్టపడుతున్నా.. నన్నెందుకు తిట్టావ్.. ఎందుకు బయటకు పంపేశావ్’అని మహేశ్‌ ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా ఫోటో షూట్‌లో ఉన్న శ్రీనివాస్‌ దగ్గరకెళ్లి తలపై ఉన్న క్యాప్‌ని బలవంతంగా తీసేసి.. వీడియో తీస్తూనే ఉన్నాడు. అయితే క్యాప్ తీయగానే అవసరాల పూర్తి బట్టతలతో ఉన్నారు. దీంతో ఈ వీడియో బయటకు వెళ్తే మహేష్ నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా అని బెదిరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అయితే ఇదంతా ఏదో సినిమా ప్ర‌మోష‌న్ కోసం చేసి ఉంటార‌ని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

లిప్‌లాక్ తో మ‌త్తెక్కిస్తున్న పూజిత పొన్నాడ‌

ముగ్గురు భామ‌ల‌తో ర‌వితేజ రొమాన్స్

బంపర్ ఆఫర్ కొట్టేసిన బుట్ట‌బొమ్మ !

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -