Saturday, May 11, 2024
- Advertisement -

‘బాహుబలి 2’ ఫస్ట్‌లుక్‌ సంచలనం సృష్టిస్తోంది!

- Advertisement -
baahubali the conclusion first look

రాజమౌళి డైరెక్షన్లో తెరకేక్కి ఘన విజయం సాధించిన సినిమా ‘బాహుబలి’. ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘బాహుబలి 2’. ఈ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా  సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్‌లుక్‌ను హీరో ప్రభాస్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ రోజు (అక్టోబరు 22న) ముంబయి ఫిలిం ఫెస్టివల్‌లో విడుదల చేశారు. అక్టోబరు 23న ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా సాయంత్రం 5:20 గంటలకు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమాల్లో భాగమైన మూవీమేళా అనే ప్రోగ్రామ్‌లో ఈ ఫస్ట్ లుకు ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాజమౌళితో సహా టీమ్ అంతా హాజరు అయ్యారు. ఈ ఫస్ట్ లుక్ లో ప్రభాస్ ఓ రెంజ్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ విజువల్‌ వండర్‌ బాక్సాఫీస్‌ వద్ద కాసులు వర్షాన్ని కురిపించింది.

ప్రస్తుతం రాజమౌళి ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే చిత్రీకరణ దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2017 ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్పటికే ఈ చిత్రం థియేట్రికల్‌, శాటిలైట్‌ హక్కులు భారీ మొత్తంలోఇప్పటికే అమ్ముడు పోయాయి.

Related

  1. ప్రభాస్ పెళ్లి ఎప్పుడో తెలుసా?
  2. అమ్మాయిలను బాధపెడుతున్న ప్రభాస్!
  3. అనుష్కకి సేవలు చేస్తున్న ప్రభాస్!
  4. రామ్ చరణ్ తో ప్రభాస్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -