Wednesday, May 8, 2024
- Advertisement -

జగన్ కు మరోసారి షాక్ ఇచ్చిన షర్మిల !

- Advertisement -

తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మరియు వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్య విభేదాలు ఉన్నాయనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే వారిద్దరు కూడా అన్న చెల్లెలు కావడంతో రక్తసంబంధంలో కుటుంబపరమైన విభేదాలు ఉండడం మామూలే అని భావించరంతా. కేవలం కుటుంబాపరమైన విభేదాలతో పాటు రాజకీయంగా కూడా షర్మిల జగన్ మద్య విభేదాలు కనిపిస్తూనే ఉన్నాయి. వైసీపీ పార్టీకి తానెంతో చేశానని.. అవసరం తీరక పక్కన పెట్టేశారని షర్మిల బహిరంగంగానే ఇంటర్వ్యూలలో తన అన్న జగన్ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి విధితమే. ఇక అప్పటినుంచి అడపాదడప జగన్ వైఖరిని విభేదిస్తూనే ఉన్నారు షర్మిల..

ఆ మద్య ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో కూడా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు షర్మిల. దీంతో సొంత చేల్లే జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతోందని.. ఇంకా ప్రజలు జగన్ నిర్ణయాలను ఏ మాత్రం సహిస్తారని టీడీపీ శ్రేణులు ద్వజమెత్తారు. ఇక తాజాగా మరోసారి జగన్ కు షాక్ ఇస్తూ షర్మిల చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. ప్రస్తుత డిల్లీ టూర్ లో ఉన్న షర్మిల అక్కడ జరిగిన మీడియా సమావేశంలో తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబంలో తన బాబాయ్ హత్య ఘోరమైన ఘటన అంటూ షర్మిల చెప్పుకొచ్చారు.

తన చిన్నాన్న ఎవరు హత్య చేశారో.. దొషులకు శిక్ష పాడాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఇక రాష్ట్రంలో వివేకా హత్య కేసు కు సంబంధించిన దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని కేసు విచారణ ఇతర రాష్ట్రాలకు బదలి చేయాలని వివేకా కూతురు సునీత రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు కూడా అందుకు అనుమటించింది. ఈ విషయంపై కూడా షర్మిల స్పందిస్తూ.. సునీతకు న్యాయం జరగాలని, కేసు విచారణ ఇతర రాష్ట్రాలకు బదలి చేయడాన్ని సమర్థించింది వైఎస్ షర్మిల. అంతే కాకుండా దర్యాప్తును ఎవరు అడ్డుకోలేరని చెప్పుకొచ్చింది. దీంతో షర్మిల చేసిన వ్యాఖ్యలు జగన్ కు మరోసారి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే తన సొంత బాబాయ్ వివేకా హత్య కేసులో జగన్ మౌనం వహించడంపై ఇప్పటికే ఎన్నో విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన విచారణ ఇతర రాష్ట్రాలకు బదలి అయితే అటు వివేకా కూతురు సునీత రెడ్డికి అలాగే వైఎస్ షర్మిలకు జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేదనే వాదన బలపడుతుంది. ఇది జగన్ కు వచ్చే ఎన్నికల వేళ తీవ్ర ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

పవన్ నాలుగో పెళ్లికి.. పోలవరం పూర్తి కావడానికి లింకేంటి ?

బీజేపీకి షాక్.. కే‌సి‌ఆర్ వ్యూహం !

హామీలు నెరవేర్చనందుకే.. ప్రధాని రాజీనామా !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -