Thursday, May 2, 2024
- Advertisement -

మోక్షజ్ఞ ఎంట్రీ పక్కా.. బాలయ్య క్లారిటీ!

- Advertisement -

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. పాతికేళ్ళ వయసున్న మోక్షజ్ఞ ఎప్పుడో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సి వుంది అయితే ఆయన ఎంట్రీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది. గతంలో బాలయ్య 100 వ సినిమా ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అప్పట్లో వార్తలు బాగా వైరల్ అయ్యాయి. కానీ అది జరగలేదు. ఇక అప్పుడప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీపై వార్తలు వస్తూనే ఉన్నాయి. మోక్షజ్ఞ ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుందని బాలయ్య చాలాసార్లు స్పష్టం చేసినప్పటికీ ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇక ఒకానొక టైంలో మోక్షజ్ఞకు సినిమాలపై ఇంట్రెస్ట్ లేదని అందుకే మూవీస్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా లేడనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. .

ఆ మద్య మోక్షజ్ఞ కూడా బాగా లావుగా కనిపించడంతో బాలయ్య తనయుడి ఎంట్రీ లేనట్లేనని నందమూరి అభిమానులు కూడా కొంత నిరాశ చెందారనే చెప్పాలి. అయితే తాజాగా బాలయ్య తనయుడి ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఆయన మోక్షజ్ఞ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోక్షజ్ఞ ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఓ రిపోర్టర్ అడుగగా.. వచ్చే ఏడాది మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం ఉండబోతుందని కన్ఫర్మ్ చేశారు. ఇక డైరెక్టర్ ఎవరనే దానిపై క్లారిటీ ఇవ్వనప్పటికి మోక్షజ్ఞ ఎంట్రీ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఉండబోతుందా ? అని అడుగగా అంతా దైవెధ్య అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ఎన్నో రోజులుగా బాలయ్య తనయుడి ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు బాలయ్య చేసిన వ్యాఖ్యలతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి మోక్షజ్ఞ కూడా తన తండ్రీ మాదిరి మాస్ లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంటారేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

విజయ్ దెబ్బకు దిల్ రాజు విలవిల!

చిరు పై బాలయ్యదే పైచేయి!

పుష్పా2 లో విలన్ గా స్టార్ హీరోయిన్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -