Thursday, May 2, 2024
- Advertisement -

వలసలు తెలంగాణకా.. పక్క రాష్ట్రాలకా?

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం మొదలుకోని ఇప్పటివరకు టి‌ఆర్‌ఎస్ పార్టీనే అధికారంలో కొనసాగుతోంది. 2014 ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని నమోదు చేసిన టి‌ఆర్‌ఎస్ 2018 ఎన్నికల్లో కూడా అంతే స్థాయిలో విజయాన్ని నమోదు చేసింది. కాగా కే‌సి‌ఆర్ అధికారం చేపట్టిన తరువాత ఎన్ని విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చూడుతూ ఎన్నో సరికొత్త పథకాలను ప్రవేశ పెట్టారు. ఎక్కడ లేని దళితబంధు, రైతు బంధు, ఉచిత విధ్యుత్ వంటి పథకాలు ప్రవేశ పెట్టి దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. తెలంగాణ ప్రజలు కూడా కే‌సి‌ఆర్ పాలనకు ఘనంగానే నీరాజనాలు పలికారు. అయితే కే‌సి‌ఆర్ పాలనపై మొదట్లో ఉన్న సానుకూలత ప్రస్తుతం ప్రజల్లో కనిపించడం లేదు అనేది కొందరి రాజకీయ వాదుల అభిప్రాయం.

ఎందుకంటే కుటుంబ పాలన అనే ఆరోపణలు వస్తుండడం, అలాగే మార్పు కోసం ప్రజల దృష్టి మళ్లడంతో బీజేపీ పార్టీ ఊహించని స్థాయిలో పరిధిని పెంచుకుంటోంది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ ప్రజల దృష్టి ఇతర పార్టీ వైపు మల్లుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంచితే తాజాగా కే‌సి‌ఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై కాస్త బిన్నంగా స్పందిస్తున్నారు నెటిజన్స్. తెలంగాణలో అన్నీ రంగాలు ఆర్థికంగా బలపడుతున్నాయని, రాష్ట్రం వేగంగా అభివృద్ది చెందడం వల్లే ఇది సాధ్యమైందని కే‌సి‌ఆర్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు కే‌సి‌ఆర్ వ్యాఖ్యానించారు. దాదాపుగా 30 లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వస్తున్నారని కే‌సి‌ఆర్ చెప్పుకొచ్చారు.

అయితే తెలంగాణకు వస్తున్నారా లేదా తెలంగాణ ప్రజలే ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారా ? అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. సరైన ఉపాధి అవకాశాలు లేని ఎంతో మంది ప్రజలు తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు లేదా ఇతర దేశాలకు వలసలు వెతున్నారని, కాని కే‌సి‌ఆర్ మాత్రం తెలంగాణ కే వలసలు వస్తున్నారని చెప్పడం హాస్యాస్పదం అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, పాలమూరు వంటి ప్రాంతాలను నుంచి ఇప్పటికీ కూడా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నా వారి సంఖ్య అధికంగానే ఉందంటూ.. ప్రజలకు జీవనోపాధి కల్పించడంలో కే‌సి‌ఆర్ కే‌సి‌ఆర్ ప్రభుత్వం విఫలం అయిందనే విమర్శలు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇదేంటి చంద్రబాబు.. జగన్ను కాపీ కొట్టడమా?

కాంగ్రెస్ కే ఎందుకు ఈ అగ్ని పరీక్ష!

జగన్ ట్విస్ట్ లు, బాబు ప్లాన్లు.. హిట్ పెంచుతోన్న వ్యూహాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -