Tuesday, May 21, 2024
- Advertisement -

మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా దర్శకుడు ఇతనే!

- Advertisement -
balakrishna confirmed his son debut movie

నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞని హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ విదేశాల్లోని ప్రముఖ యాక్టింగ్ స్కూల్ లో నటనపై శిక్షణ పొందుతున్నాడు.

బాలకృష్ణ తనయుడి సినీ ఎంట్రీ కోసం మంచి కథ, డైరక్టర్ కోసం కొంతకాలంగా గాలిస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం మోక్షజ్ఞని క్రిష్ దర్శకత్వంలో హీరోగా పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యారంట. ప్రస్తుతం క్రిష్ బాలయ్య తో గౌతమి పుత్ర శాతకర్ణి అనే సినిమా తీస్తున్నాడు. క్రిష్ టేకింగ్ బాలకృష్ణ కి చాలా అద్భుతంగా నచ్చిందట.

అందుకే కొడుకుని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత క్రిష్ పై పెట్టారని ఫిల్మ్ నగర్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ మొదటి సినిమా తన బ్యానర్లోనే చేయాలని వారాహి చలన చిత్ర బ్యానర్ అధినేత సాయి కొర్రపాటి పట్టుబట్టి కూర్చున్నారు. తమ సినిమా కోసం “రానే వచ్చాడయ్యా .. ఆ రామయ్య” అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించారు. నిర్మాత విషయంలో మాత్రం మార్పులేదని తెలిసింది. కథా చర్చల స్థాయిలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు.

Related

  1. బాలిక‌ల‌ను వ్య‌భిచార రొంపిలోకి దింపుతున్న హైటెక్ ముఠా!
  2. బన్నీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్మీ
  3. సుకన్య వ్యభిచారం చేయడానికి కారణం అదేనా?
  4. అభిమానికి క్లాస్ పీకిన అనసూయ! ఎందుకంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -