Thursday, April 25, 2024
- Advertisement -

నాగచైతన్య వ్యాఖ్యలు.. సమంతను ఉద్దేశించేనా..!

- Advertisement -

అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయిన తర్వాత వీరు మాట్లాడిన ప్రతి మాట కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. గతంలో విడాకులపై సమంత స్పందించారు. చైతూతో విడిపోయిన తర్వాత తనకు చావాలని అనిపించిందని, అదే క్రమంలో తాను మానసికంగా చాలా బలంగా మారానని సామ్‌ చెప్పుకొచ్చారు.

మరొక షోలో సామ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం తాను కెరీర్, సినిమాలపైనే పూర్తిగా దృష్టి సారించానని, చైతూ గురించి మాట్లాడదలుచుకోలేదని కుండ బద్దలు కొట్టారు. ఇప్పటి వరకు అడపాదడపా సమంత స్పందిస్తూ వచ్చారు. కానీ మొదటిసారి పరోక్షంగా సామ్‌తో విడాకులపై చైతన్య స్పందించారు. చైతూ మాటలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

ఇటీ వల ఒక టీవీ షోలో పాల్గొన్న చైతన్య మొదటి సారి తన మనసులోని విషయాలను బయటపెట్టారు. మీరు ఎలాంటి పాత్రల్లో నటించకూడదు అని అనుకుంటున్నారు అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు చైతూ స్పందించారు. నేను చేసిన పాత్రలు నాకుటుంబం, నా వక్తిగత జీవితంపై ఎటువంటి ప్రభావం చూపించకూడదు. అటువంటి పాత్రలనే నేను ఎప్పటికీ చేయనని చైతూ స్పష్టం చేశాడు. గతంలో సమంత పలు సినిమాల్లో నటించిన పాత్రల విషయంలో చైతన్యతో గొడవలకు దారి తీసిందని, అదే వారి విడాకులకు కారణమైందని ఇన్నాళ్లూ సోషల్‌ మీడియలో జరుతున్న ప్రచారం. దానికి బలం చేకూర్చేలా చైతూ వ్యాఖ్యలు ఉన్నాయి.

షాక్‌లో మెగా ఫాన్స్‌

చైతూ విషయంపై మాట్లాడదలుచుకోలేదు

సర్జరీతో మరింత అందం పోందిన హీరోయిన్స్ వీరే…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -