Tuesday, May 7, 2024
- Advertisement -

జగన్ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రలే అతి పెద్ద స్కామ్ !

- Advertisement -

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వాలెంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు ఇలా చాలా వాటిని ప్రవేశ పెట్టి ప్రభుత్వాన్ని ప్రజలకు అత్యంత చేరువ చేశారు. అయితే జగన్ ప్రవేశ పెట్టిన ఈ సంస్కరణలు ఎంత ప్రయోజనకరంగా ఉన్నప్పటికి ఆ వ్యవస్థలోని విధినిర్వహణపై నిత్యం విమర్శలు వస్తూనే ఉన్నాయి. వాలెంటరీ వ్యవస్థ కేవలం వైసీపీ పార్టీకి మాత్రమే సంబంధించినదని, ఇక సచివాలయాల్లో కేవలం వైసీపీ వారికి మాత్రమే పనులు జరుగుతాయని ఇలా చాలా రకాల విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక రైతు భరోసా కేంద్రాలపై ఇలాంటి విమర్శలు కాస్త ఎక్కువగానే వినిపిస్తాయి. .

రైతులకు అవసరమైన అన్నీ రకాల సదుపాయాలను ఆర్బికే ల ద్వారా అందిస్తోంది జగన్ సర్కార్. అయితే సామాన్య రైతులను ఆర్బికే లలో పట్టించుకోరని, గ్రామాల్లో భూస్వాములకే అధిక ప్రదాన్యం ఇస్తారనే విమర్శలు మొదటి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంచితే రైతు భరోసా కేంద్రాలపై జనసేన పార్టీకి చెందిన నేత నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంట నష్టపోయిన రైతులు ఆర్బికే ల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారని ఆయన ద్వజమెత్తారు.

సామాన్య రైతులకు ఆర్బికే లలో స్థానం లేదా ? అంటూ ప్రశ్నించారు. ముఖ్యంగా ఆర్బికే లలో ధాన్యం కొనుగోలు విషయంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని, దాదాపుగా 10,700 రైతు భరోసా కేంద్రాలలో అవినీతి జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయని నాదెండ్ల మనోహర్ అన్నారు. దీన్ని బట్టి చూస్తే జగన్ ప్రభుత్వంలో అతి పెద్ద స్కామ్ ఆర్బికే లలోనే జరుగుతున్నట్లు అర్థమౌతోందని నాదెండ్ల చెప్పుకొచ్చారు. గుంటూర్ జిల్లా తెనాలి లో నిర్వహించిన మీడియా సమావేశంలో నాదెండ్ల పై విధంగా వ్యాఖ్యలు చేశారు. మరి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

కోమటిరెడ్డిని చిక్కులో పడేసిన.. రాహుల్ జోడో యాత్ర !

జగన్ కు తలనొప్పిగా మారుతున్న బొత్స !

కే‌సి‌ఆర్ మాస్టర్ ప్లాన్ కు.. ఎంతటి వారైనా చిక్కల్సిందే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -