Wednesday, May 1, 2024
- Advertisement -

T20 WORLDCUP 2022 : బంగ్లా వణికించింది.. భారత్ కు విజయం కలిసొచ్చింది !

- Advertisement -

టి20 వరల్డ్ కప్ లో అడిలైడ్ వేదికగా టీమిండియా వర్సస్ బంగ్లాదేశ్ మద్య జరిగిన ఉత్కంఠపోరులో ఫైనల్ గా భారత్ విజయం సాధించింది. బంగ్లాదేశ్ పై ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ కు అత్యంత చేరువలో నిలిచింది. మొదట టాస్ ఒడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. టీమిండియా స్టార్ ఓపెనర్ కే‌ఎల్ రాహుల్ ఈ మ్యాచ్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. 32 బంతుల్లో 50 పరుగులు చేసి ( 3 పొర్లు, 4 సిక్సులు ) మెరుగైన ఇన్నింగ్స్ అందించాడు. ఇక కెప్టెన్ రోహిత్ ( 2 ) ఎప్పటి లాగే సింగిల్ డిజిట్ తోనే నిష్క్రమించాడు. విరాట్ కోహ్లీ తన భీకర ఫామ్ ను కంటిన్యూ చేస్తూ 44 బంతుల్లో 64 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

ఇక సూర్య కుమార్ యాదవ్ ఉన్నంతలో విజృంభించి 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. దాంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 184 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందు ఉంచింది. ఇక ఆ తరువాత 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఆది నుంచే భారత బౌలర్లపై ఎదురుదాడి చేసింది. ఓపెనర్ లిటన్ దాస్ కేవలం 27 బంతుల్లోనే 60 పరుగ్లు చేసి టీమిండియా వెన్నులో వణుకు పుట్టించాడు. మొదటి ఏడు ఓవర్ల వరకు భారత బౌలర్లపై అడ్డూ అదుపు లేకుండా విరుచుకుపడ్డ బంగ్లా బ్యాట్స్ మెన్స్ కు వర్షం అంతరాయం కలిగించింది. ఇక ఆ తరువాత డాక్ వర్త్ లూయిస్ ప్రకారం లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151 కుదించారు. దాంతో బంగ్లా బ్యాట్స్ మెన్స్ తీవ్ర ఒత్తికి లోనై వరుస వికెట్లు చేజార్చుకున్నారు. ఇక చివరివరకు పోరాడిన బంగ్లాదేశ్.. ఆ తరువాత చేతులెత్తేసింది. దాంతో భారత్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -