Monday, May 6, 2024
- Advertisement -

దేత్తడి హారికకు టూరిజం డిపార్ట్‌మెంట్ దిమ్మతిరిగే షాక్!

- Advertisement -

తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్ దేత్త‌డి హారిక‌కు షాక్ ఇచ్చింది. నిన్న మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా హారిక‌ను టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మిస్తూ టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ గుప్తా ప్ర‌క‌టించారు. ఈ అమ్మడు బిగ్ బాస్ 4 తో మంచి క్రేజ్ సంపాదించింది. హారిక‌కు అపాయింట్ మెంట్ ఇస్తున్న ఫోటోల‌ను టూరిజం శాఖ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఈ రోజు ఆ పోస్ట్ ను టూరిజం శాఖ తొల‌గించింది. మంత్రికి, ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా నియామకం జరిగినట్లు తెలుస్తోంది. 

ఈ వ్యవహారంపై టూరిజం శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వ్యవహారం చీఫ్ సెక్రటరీ వరకు వెళ్లింది. దీంతో వెంటనే అలర్టెయిన అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో హారికకు నియామకానికి సంబంధించిన వివరాలను తొలగించారు. అయితే తెలంగాణ టూరిజం అధికారిక ట్విట్టర్‌లో మాత్రం ఆమె నియామకానికి సంబంధించిన వివరాలు అలాగే ఉన్నాయి. అసలు హార‌కను ఎందుకు అంత స‌డెన్ అంబాసిడ‌ర్ గా నియ‌మించారు.

మంత్రి గానీ ఇతర అధికారుల పర్మిష‌న్ తీసుకోకుండా ఎందుకు నియామ‌క ప‌త్రాలు అంద‌జేశారన్న ప్ర‌శ్న వినిపిస్తోంది.  ఇక యూట్యూబ్‌లో తన ప్రోగ్రామ్స్ ద్వారా మంచి గుర్తింపు పొందిన హారిక.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. కాగా, హారికకు యూట్యూబ్‌లో 1.60 లక్షల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఆమె యాస, భాష పక్కా తెలంగాణ స్టైల్లో ఉంటాయి. 

అఖిల్ సినిమాకి ప్రమోషన్స్ మొదలపెట్టాలని ప్లాన్ చేస్తున్న చిత్రబృందం….!

ఉత్తరాఖండ్ లో రాజకీయ సంక్షోభం.. సీఎం పదవి పై కన్ను..!

అంబానీ బాంబ్ కేసులో కొత్త ట్విస్ట్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -