Thursday, April 18, 2024
- Advertisement -

అంబానీ బాంబ్ కేసులో కొత్త ట్విస్ట్..!

- Advertisement -

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటికి సమీపంలో ఇటీవల కలకలం రేపిన పేలుడు పదార్థాల వాహనం యజమానిగా భావిస్తున్న హిరేన్‌ మన్‌సుఖ్‌ మృతిపై విస్తుపోయే నిజాలను బయటపెట్టింది మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్​). మన్​సుఖ్​ది హత్యేనని ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది.

వసాయ్​లోని మాండ్వీలో మన్​సుఖ్ మొదటి ఫోన్ లభ్యం కాగా.. అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో తుంగరేశ్వర్​ వద్ద మన్​సుఖ్​ రెండో ఫోన్​ను కనుగొన్నారు అధికారులు. దీంతో మన్​సుఖ్​ను చంపిన హంతకులు.. మృతదేహాన్ని వసాయ్​ తీసుకెళ్లి.. మళ్లీ ఠాణెకు తీసుకొచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. మన్​సుఖ్ చంపి.. నీటిలో వేసినట్లు ప్రాథమికంగా ధ్రువీకరించారు.

ప్రస్తుతం అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల ఘటనకు సంబంధించి పోలీస్​ అధికారి సచిన్​ వేజ్ దర్యాప్తు చేస్తున్నారు.దక్షిణ ముంబయిలోని అంబానీ నివాసానికి సమీపంలో ఇటీవల జిలెటిన్‌ స్టిక్స్‌తో ఓ వాహనాన్ని పోలీసులు కనుగొన్నారు. అనంతరం ఆ వాహనం తనదేనని, వారం రోజుల క్రితం అది చోరీకి గురైందని మన్‌సుఖ్‌ పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో గురువారం అదృశ్యమైన ఆయన శుక్రవారం సముద్రపు పాయలో శవమై కనిపించారు.

అవకాశాలు లేకున్నా అందంతో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీస్ వీరే…!!!

బాలయ్యకు అవమానం.. గోబ్యాక్ అంటూ నినాదాలు!

క్యూట్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్!

విద్యార్థులకి డేంజర్… స్కూల్ కి వెళ్తున్నారా.. ఇక్కడ స్కూల్ లో ఏమైంది అంటే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -