Saturday, April 20, 2024
- Advertisement -

అనంత బాబు వ్యవహారంపై స్పందించిన బొత్స

- Advertisement -

ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తనతో పాటు తీసుకెళ్లి శవంగా తీసుకొచ్చిన అనంతబాబుపై బాధిత కుటుంబం ఒత్తిడిపై హత్య కేసు నమోదైంది. ఒక వైపు తమకు న్యాయం చేయాలంటూ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తుంటే.. అనంతబాబు స్వేచ్ఛగా తిరగడాన్ని ప్రతిపక్షాలు తప్పు పట్టాయి.

ఈ వ్యవహారంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. వైసీపీ ప్రభుత్వంలో చట్టానికి చుట్టాలు ఉండరన్నారు. అనంతబాబుపై కేసు నమోదు చేసిన నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. తప్పు చేయలేదనే ధైర్యంలో అనంతబాబు అలా ధైర్యం తిరిగి ఉంటారన్నారు.

ఘటన జరిగిన రోజే బాధిత కుటుంబం వాంగ్మూలం ఇచ్చి ఉంటే ఈ పాటికే అనంత బాబును అరెస్టు చేసి ఉండేవారన్నారు. కానీ మృతుడి కుటుంబ సభ్యులు రెండురోజుల పాటు కాలయాపన చేశారని బొత్స వ్యాఖ్యానించారు.

మంత్రుల దగ్గరకు వెళ్లొద్దు.. నేనే సీనియర్‌ను..

తెలంగాణ రాజకీయాలపై పవన్ కల్యాణ్ ఫోకస్

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -