Tuesday, May 21, 2024
- Advertisement -

అందుకే కౌషల్ కోట్ల మనసులు గెలిచాడు

- Advertisement -

కౌషల్ కు తోటి కంటెస్టెంట్లకు మధ్య తేడా ఆదివారం బిగ్ బాస్ షోలో మరోసారి బయటపడింది. ఇప్పటికే అతడికి వీళ్లకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. టాస్కులు ఆడే విధానం, మాట తీరు, పద్ధతి, ఫెయిర్ గా ఉండటం, ప్యాంపరింగులు పెట్టుకోకపోవడం, కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం, మొహమాటాలు, దాపరికాలు లేకుండా వ్యవహరించడం కౌషల్ వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులు ఆకట్టుకునేలా చేస్తే. అందుకు పూర్తి విరుద్ధంగా మిగిలిన కంటెస్టెంట్లు వ్యవహరించే తీరుతో, వారి పేర్లు ఎత్తితేనే ఛీదరించుకునేలా చేసుకున్నారు. వాస్తవానికి బిగ్ బాస్ హౌసులోకి అడుగు పెట్టడానికి ముందు కౌషల్ కంటే గీతామాధురికి ఎక్కువ ఫ్యాన్సు ఉండేవారు. బాలనటుడిగా, నటుడిగా తనీష్ కి అంతో ఇంతో అభిమానులున్నారు. కౌషల్ పేరు కూడా చాలామందికి తెలియదు. కానీ తన విలక్షమైన వ్యక్తిత్వం, పోరాడేతత్వంతో కౌషల్ తన స్థానాన్ని నెంబర్ వన్ స్థానంగా నిలుపుకున్నాడు. టాస్కుల్లో ప్రాణం పెట్టి ఆడటం, తోటి వారి పట్ల నిజాయతీగా వ్యవహరించడం వంటివి ఆయనను పైకి తీసుకెళ్తే, మిగతా కంటెస్టెంట్లు ప్యాంపరింగులు, బంధాలు, అనుబంధాలు, పులిహోరా కబుర్లు, మంచాలెక్కి కౌషల్ మీద పడి ఏడవడాలు చేస్తూ ప్రేక్షకులకు కంపరమెత్తేలా వ్యవహరించారు. ఆఖరికి చివరి వారం ఫినాలేకి చేరువవుతున్న సమయంలోనూ మిగిలిన కంటెస్టెంట్లు సేఫ్ గేమ్ పేరుతో ఫేక్ గేమ్ ఆడారు కౌషల్ మాత్రం ఎప్పటిలా ఆకట్టుకున్నాడు.

క్యాంపెయినింగ్ చేసుకోండి అని నానీ చెప్పీచెప్పడంతోనే కౌషల్ తన టాలెంట్ మరోసారి బయట పెట్టాడు. ఓ రాజు తన రాజ్యంలో ఉన్న పులిని వేటాడే మొనగాడికి తన రాజ్యంలో సగభాగంతో పాటు కుమార్తెను ఇస్తాననడంతో ఓ వేటగాడు కేవలం పులిని వేటాడటంపైనే దృష్టి పెట్టాడు. తన లక్ష్యం, ధ్యేయం అన్నీ పులిని వేటాడటమే అనే దిశగా దూసుకుపోతుంటే మిగిలిన వేటగాళ్లు పులిని వేటాడటం మానేసి, ఆ వేటగాడిని గాయపర్చడం, వేటాడటం చేశారు అంటూ కథ చెప్పాడు. గాయాలపాలైన వేటగాడికి అతడి తల్లి, కుమార్తె కొత్త ఉత్సాహం ఇచ్చి, మరింత బలాన్ని అందించడంతో వేటలో మళ్లీ దూసుకుపోతున్నాడని, కచ్చితంగా పులిని వేటాడేస్తాడని చెప్పిన కథలో పులిని వేటాడే వేటగాడిగా తనను, వేటాగాడిని వేటాడుతున్న వేటగాళ్లుగా తోటి కంటెస్టెంట్లను, రాజుగా బిగ్ బాస్ ను, పులిగా బిగ్ బాస్ టైటిల్ ను పోల్చుతూ కౌషల్ చెప్పిన విధానం అందర్నీ ఆకట్టుకుంది. పైగా నానీ ఇలా చెప్పీచెప్పగానే అంతవేగంగా, సూటిగా ధాటిగా ఎక్కడా తడబాటు లేకుండా, మంచి టైమింగుతో మంచి ఉదాహరణ కథతో కౌషల్ తన బిగ్ బాస్ హౌసులోని జర్నీ మొత్తాన్ని ప్రేక్షకుల కళ్లకు కట్టేశాడు.

టైటిల్ గెలవడం కోసం తాను ఎంత కష్టపడింది, ఎంత తపనతో పోరాడింది. టాస్కుల్లో ఎంత ఎఫర్ట్ పెట్టిందీ చక్కగా వర్ణించి, తన కష్టాన్ని గుర్తించి ఓట్లు వేయమని అభ్యర్ధించాడు. తోటి కంటెస్టెంట్లకు ఎందుకు ఓట్లు వేయకూడదో కూడా ఒకటి రెండు ఉదాహరణలతో సహా వివరించి మరోసారి ముక్కుసూటిగా మాట్లాడే మనిషి అని నిరూపించుకున్నాడు. మిగతా వారి వైఫల్యాలను, తన కష్టాన్ని వివరించిన తీరుతో కౌషల్ మళ్లీ తన ప్రత్యేకతను చాటుకుని, ప్రేక్షకుల మనసుల్ని గెల్చుకున్నాడు. కానీ మిగతావాళ్లు ఎవరికి వాళ్లే తాము మంచివాళ్లం. తమతో పాటు తోటి వాళ్లు చాలా మంచివాళ్లు. మా మంచితనం చూసి ఓటు వేయండి. మాలో అత్యంత మంచివారికే పట్టం కట్టండి.అంటూ ప్రేక్షకులను విసిగించారు. టైటిల్ గెలిచే అవకాశం వచ్చినప్పుడు, ఫినాలే రౌండులో ఉన్నప్పుడు కూడా ఈ సేఫ్ గేమ్ ఏంటో అర్ధం కావడం లేదని ఆడియన్స్ మండిపడుతున్నారు. మొదట నుంచీ ఇదే రకమైన ఫేక్ గేమ్ ఆడబట్టే మీరు గెలిచే అవకాశాలను కోల్పోయారని తేల్చి చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -