Wednesday, May 22, 2024
- Advertisement -

బిగ్ బాస్ ఫినాలే కౌంట్ డౌన్ స్టార్ట్

- Advertisement -

వచ్చే ఆదివారంతో బిగ్ బాస్ 2 తెలుగు సీజన్ ముగిసిపోతోంది. ఆ రోజు గ్రాండ్ ఫినాలేలో ఎవరు విజేత అనేది తేలబోతోంది. అయితే ఐదుగురు కంటెస్టెంట్ల కుటుంబీకులు, స్నేహితులు, బంధువులు ఈ వారం భారీగా క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు. తమ వారికి ఓట్లు వేయాలని సోషల్ మీడియా ద్వారా విన్నవించుకుంటున్నారు. ఫినాలేకి చేరిన ఐదుగురిలో కౌషల్ ఇప్పటికే జనం మనసులను గెల్చుకున్నాడు. కోట్ల మంది అభిమానులు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో ఉన్న వారు అతడికి పెద్ద ఎత్తున ఓట్లు వేస్తున్నారు. మిస్డ్ కాల్స్, మెయిల్స్ ద్వారా ఒక్కో అభిమాని వీలైనంత ఎక్కువ ఓట్లు కౌషల్ కు వేస్తూ, ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నారు. మొదటి నుంచీ ఆయనకు అభిమానులే పెద్ద అండగా నిలిచారు. లేదంటే కౌషల్ ఎప్పుడో మొదటి రెండు మూడు వారాల్లోనే ఎలిమినేట్ కావాల్సింది. మిగిలిన ఇంటి సభ్యులు అంతా అతడిని ఒంటరిని చేసి, కక్షగట్టి, గ్రూపులుగా ఏర్పడి, మానసికంగా కౌషల్ ను తీవ్ర ఇబ్బందులు పాల్జేస్తున్నారు. ఏ కంటెస్టెంట్ నామినేట్ కాని విధంగా ఈ సీజన్ లో కౌషల్ ఒక్కడే 10 సార్లు నామినేట్ అయ్యాడు అంటేనే మిగతా సభ్యులు అతడి మీద ఎంత పగబట్టేశారో అర్ధమవుతోంది. దానికి తోడు రోజూ మంచాలెక్కి అతడి గురించి గుసగుసలాడంకుంటూ, తిట్టుకుంటూ అతడి మీద పడి ఏడవడంతోనే గీతా దీప్తి తనీష్ సామ్రాట్ సహా ఇంటి సభ్యుల్లో ఎక్కువమంది గడిపేశారు. దీంతో కౌషల్ ఫ్యాన్ పాలోయింగ్ పెరిగిపోయింది. అతడి వ్యక్తిత్వం, పోరాడేతత్వం, ఒంటరి పోరాటం కూడా అభిమానులను పెంచింది. అందుకే 10 సార్లు నామినేట్ అయినా సేవ్ అవుతూ వచ్చాడు.

కానీ కౌషల్ అభిమానులకు అసలు సిసలు చాలెంజ్ ఈ 5 రోజుల్లో ఎదురవుతోంది. ఇన్నాళ్లూ ఒక లెక్క ఇప్పుడొక లెక్క అని ఈ వారం ఓటింగ్ చెబుతోంది. ఫినాలే సందర్భంగా మిగిలిన కంటెస్టెంట్ల కుటుంబీకులు, స్నేహితులు పెద్దఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. తమ వారికి ఓట్లు వేయాలని ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. భారీగా మెయల్ అకౌంట్స్, మిస్డ్ కాల్స్ ఇస్తూ తమ వారి గెలుపు కోసం పోరాడుతున్నారు. అందుకే వారి నుంచి కౌషల్ ఆర్మీకి ఈ వారం పెద్ద సవాల్ వస్తోంది. పైగా ఎలిమినేట్ అయిపోయిన వారిలో కూడా కొందరు కొశల్ ఓటమి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎవరు గెలిచినా ఫర్వాలేదు కానీ కౌషల్ ఓడిపోతే చాలు…అనే కసితో వాళ్లు ఆర్గనైజ్డ్ ఓటింగులో పాల్గొంటున్నారు. అందుకే ఇన్నాళ్లూ ఎన్ని కోట్ల ఓట్లు వేశాం అన్నది కాదు కౌషల్ ఆర్మీకి లెక్క. శనివారం మధ్యాహ్నం 12గంటల వరకూ ఎన్ని కోట్ల ఓట్లు వేశాం. ఎంత బంపర్ మెజార్టీతో గెలిపించాం అన్నదే లెక్క. ఏమాత్రం అలసత్వం వహించినా ఇన్నాళ్లూ హౌసులో కౌషల్, హౌస్ బయట అతడి అభిమానులు పడ్డ శ్రమంతా వృథా అయిపోతుంది. అందుకే ఈ ఐదు రోజులు శక్తివంచన లేకుండా వాళ్లంతా అతడికి వీలైనన్ని ఎక్కువ ఓట్లు వేసి గెలిపించే పనిలో పడ్డారు. ఇతర కంటెస్టెంట్ల మీద కసితో ఓటింగులో పాల్గొంటున్నారు. అయితే ఈ సారి ఫినాలేలో మాత్రం బిగ్ బాస్ చరిత్రలోనే రికార్డు స్థాయి ఓటింగ్ కౌషల్ ఆర్మీ వల్ల రికార్డ్ కాబోతోందని మాత్రం స్పష్టమవుతోంది. ఇక విజేత ఎవరో ప్రత్యేకంగా చెప్పాలా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -