Tuesday, April 30, 2024
- Advertisement -

సార్​ మీ కులపోడినే.. కొద్దిగా చాన్స్​ ఇవ్వరూ..! బ్రహ్మాజీకి నెటిజన్​ అభ్యర్థన

- Advertisement -

కులం అనేది మన జీవనంలో భాగమైంది. ఇక కులగజ్జి ఉన్నవాళ్లు మన చుట్టూ చాలా మందే ఉంటారు. ముఖ్యంగా రాజకీయాల్లో, సినీ రంగంలో కులం ప్రస్తావన ఎక్కువ. కొంతమంది బాహాటంగానే కులం గురించి ప్రస్తావిస్తుంటారు. మరికొందరు మాత్రం లోలోపల. ఇక సోషల్ మీడియాలో కుల ప్రాతిపదికన ప్రత్యేకంగా గ్రూప్​లు కూడా ఏర్పడ్డాయి. దీన్ని బట్టి సమాజంలో కులం ఎంతలా వేళ్లూనుకున్నదో చెప్పవచ్చు.

ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కొంత ఆదర్శనీయమైన జీవితం గడుపుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ వ్యక్తి సోషల్ మీడియాలో బ్రహ్మాజీని ఉద్దేశిస్తూ.. ’ సార్​ నేను మీ కమ్యూనిటీ వాడినే.. నాకు సినిమాలో ఏదైనా అవకాశం ఇప్పించండి’ అంటూ అభ్యర్థించాడు. దీనికి బ్రహ్మాజీ తన దైన స్టయిల్​లో సమాధానం చెప్పాడు. ‘ నేను ఇండియన్​ను, తెలుగోడిని ఇదే నా కమ్యూనిటీ’ అంటూ ఘాటుగా కౌంటర్​ ఇచ్చాడు.

ఇక బ్రహ్మాజీ కౌంటర్​ను, సదరు నెటిజన్​ అమాయకత్వాన్ని చూసి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎవరైనా కులం గురించి ప్రస్తావించినా.. అది అంతర్గతంగా ప్రస్తావిస్తారు. కానీ సదరు నెటిజన్​ మాత్రం అమాయకంగా అందరికీ కనిపించేలా కామెంట్​ పెట్టాడు. బ్రహ్మాజి కూడా అతడికి గట్టిగానే కౌంటర్​ ఇచ్చాడు.

Also Read

సినీ మేకర్స్ కి ఈ లీకుల బాధ తప్పదా..! బ్రేక్ పడేదేలా..!

వరుణ్​తేజ్​ ఔదార్యానికి నెటిజన్లు ఫిదా..!

సీక్రెట్ గా..స్పీడ్ గా.. కొత్త సినిమా షూటింగ్ ముగించిన మారుతి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -