Friday, May 3, 2024
- Advertisement -

ఎర్రబెండ.. మీరెప్పుడైనా చూశారా? వాటితో ఆరోగ్య ప్రయోజనలెన్నో..

- Advertisement -

బెండ కాయలు తింటే తెలివితేటలు పెరుగుతాయని.. చురుగ్గా అవుతారని పెద్దలు చెబుతుంటారు. ఇక బెండలో ఎన్నో వెరైటీలు చేసుకుంటూ ఉంటారు. బెండ కాయ ఫ్రై, బెండకాయ చారు, బెండకాయ పులుసు ఇలా రకరకాల వంటలు ఉంటాయి. సాధారణంగా బెండకాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కాస్త ముదురు బెండలైతే ముదురాకుపచ్చ రంగులో ఉండొచ్చు. అయితే వరంగల్​కు చెందిన ఓ రైతు మాత్రం .. ఎరుపు రంగులో ఉన్న బెండను పండిస్తున్నారు. అది కూడా సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్నాడు. ఇది చాలా అరుదైన రకమని ఆయన చెబుతున్నారు.

వరంగల్​ అర్బన్​ జిల్లా పెంబర్తికి చెందిన ప్రభాకర్​రెడ్డి సేంద్రియ వ్యవసాయం చేస్తుంటాడు. ఇటీవల తన పొలంలో ఎరుపు రంగులో ఉండే బెండను సాగుచేశారు. ఈ బెండ ఎంతో అరుదైన రకమని.. ఈ వంగడాన్ని ‘రాధిక’ అని పిలుస్తారని ఆయన చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ బెండకు మార్కెట్​లో బాగా డిమాండ్​ ఉందని.. దిగుబడి కూడా ఆశాజనకంగా వచ్చిందని చెబుతున్నాడు.

ఈ బెండపై వరంగల్​ ఉద్యానశాఖ అధికారి సుద్దాల శంకర్​ మాట్లాడుతూ.. ’ రాధిక వంగడం తెలంగాణ ప్రాంతంలో చాలా అరుదుగా మాత్రమే పండుతుంది. దీన్ని ఎక్కువగా చలి ప్రదేశాల్లో పండిస్తూ ఉంటారు. ఈ బెండతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది. రక్తహీనతకు ఈ బెండ బాగా ఉపయోగపడుతుంది. ఇక ఇందులో సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉంటాయి.’ అని వివరించారు.

Also Read

చేపల పులుసు ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తినాల్సిందే?

మష్రూమ్ ఆమ్లెట్ ఇలా చేస్తే అస్సలు వదిలిపెట్టరు?

గుండెజబ్బులు ఎక్కువగా మహిళలకు వస్తాయా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -