త్వరలో ఆర్​ఆర్​ఆర్​ నుంచి ‘బీ హైండ్​ ద సీన్స్​’ .. !

- Advertisement -

ఆర్​ఆర్​ఆర్​పై ఇప్పటికే ఓ రేంజ్​లో హైప్​ క్రియేట్​ అయ్యింది. పాన్​ ఇండియా స్థాయిలో ఈ మూవీపై చర్చ జరుగుతోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ మేకింగ్​ వీడియో రికార్డు స్థాయిలో వ్యూస్​ తీసుకొచ్చి దుమ్ము దులిపేసింది. ఇక అక్టోబర్​ 13న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఆ లోగా సినిమాకు ఫుల్​ హైప్​ క్రియేట్​ చేయాలని భావిస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్​ చేయబోయే ఎవరు మీలో కోటిశ్వరుడు అనే టీవీ షోకు తొలి గెస్ట్​గా చరణ్​ రాబోతున్నట్టు సమాచారం.

ఇది సినిమా ప్రమోషన్​లో భాగంగానే చేయబోతున్నట్టు సమాచారం. మరోవైపు ఆ లోపు నటీనటులతో ఇంటర్వ్యూలు, టీవీ షోలతో ప్రమోషన్​ చేసుకోవాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ప్రమోషనల్ సాంగ్​ చిత్రీకరిస్తున్నారు. ఆర్​ఆర్​ఆర్​కు సంబంధించి ‘బీ హైండ్​ ద సీన్స్​’ పేరుతో ఓ డాక్యుమెంటరీని విడుదల చేయబోతున్నారట. దీన్ని ఓ ప్రముఖ ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయట.

- Advertisement -

ఆర్​ఆర్​ఆర్​ విడుదలైతే తారక్​, చరణ్​ పాన్​ ఇండియా స్టార్స్​గా మారిపోనున్నారు. అందుకోసమే వాళ్లు ఈ సినిమా కోసం ఇన్నేళ్లుగా కష్టపడుతున్నారు. సినిమా విడుదలకు నెల రోజుల ముందు నుంచే భారీగా ప్రమోషన్​ వీడియోలు, యూట్యూబ్​ ఇంటర్వ్యూలు, టీవీ షోలతో ఆర్​ఆర్​ఆర్​ టీం అలరించనున్నది. ఇందుకోసం ఇప్పటినుంచే పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. భారీ బడ్జెట్​ సినిమా కావడంతో.. ఆ మేరకు ఓపెనింగ్స్​ తీసుకురావాలని చిత్ర యూనిట్​ భావిస్తున్నదట.

Also Read

వెబ్​సీరిస్​లో నటించబోతున్న దగ్గుపాటి హీరోలు..!

అనిల్​ రావిపూడి -మహేశ్​ – గీతా ఆర్ట్స్​ కాంబినేషన్​ ఫిక్స్​ అయిందా?

మునుపెన్నడూ లేనంతగా బాలయ్య లైనప్..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -