Saturday, May 4, 2024
- Advertisement -

దిల్ రాజు శంకర్ ని మేనేజ్ చేయగలడా?

- Advertisement -

దర్శకుడు శంకర్ ఒక సినిమా మొదలుపెడితే అది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. దీంతో నిర్మాతలు అనుకున్న బడ్జెట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని సమస్యలు కూడా వస్తుంటాయి. కానీ శంకర్ మీద నమ్మకంతో నిర్మాతలు అతడికి కావాల్సినవన్నీ సిద్ధం చేస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో శంకర్ కి, నిర్మాతలకు మధ్య చాలా విభేదాలు వస్తున్నాయి.

‘రోబో2’ సమయంలో లైకా సంస్థతో శంకర్ కి గొడవలు వచ్చాయి. ఇప్పుడు ‘ఇండియన్ 2’ సినిమా విషయంలో కూడా అవే గొడవలు రిపీట్ అవుతున్నాయట… బడ్జెట్ పెరిగిపోవడం ఇప్పుడు ‘ఇండియన్ 2’ సినిమాను ఏకంగా పక్కన పెట్టేయడం జరిగింది.దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు శంకర్ తో కలిసి దిల్ రాజు ఓ సినిమా చేయబోతున్నాడు.

నిజానికి ‘ఇండియన్ 2’ సినిమాకి దిల్ రాజు కూడా నిర్మాతగా వ్యవహరించాల్సి వుంది. కానీ ఆఖరి నిమిషంలో ప్రాజెక్ట్ చేతులు మారింది. ఆ సమయంలో శంకర్ కి అడ్వాన్స్ ఇచ్చాడు దిల్ రాజు. ఇప్పుడు ఆ అడ్వాన్స్ తోనే దిల్ రాజుతో సినిమా చేయడానికి శంకర్ అంగీకరించాడు. రామ్ చరణ్ హీరోగా సినిమా చెయ్యడానికి ఇప్పుడు సిద్ధంగా వున్నారు..అయితే సినిమా మేకింగ్ విషయంలో దిల్ రాజు స్టైల్ వేరు.. శంకర్ స్టైల్ వేరు.

దిల్ రాజు తన ప్రాజెక్ట్ లన్నీ కూడా ప్లానింగ్ ప్రకారం జరిగేలా చూసుకుంటాడు.డైరెక్టర్ లకి తన శరతులతో చుక్కలు చూపిస్తాడు.కానీ శంకర్ అలా కాదు. ఆయన సినిమా ఓ పట్టాన పూర్తవదు. మరి శంకర్ ని దిల్ రాజు కంట్రోల్ చేయగలడా..? దిల్ రాజు షరతులు శంకర్ కి వర్తిస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే దిల్ రాజు ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చాడని.. సినిమాని ఇంతలోనే పూర్తి చేయాలి..

ఈ టైమ్ కి పూర్తి చేయాలనే నిబంధనలతో రంగంలోకి దిగబోతున్నాడని చెబుతున్నారు. ఇలాంటి షరతులు శంకర్ కి కొత్తేమీ కాదు. ఎన్ని షరతులు పెట్టినా.. ఆయన అనుకున్న సమయానికే సినిమాని పూర్తి చేస్తాడు.

ప్రొడ్యూసర్ గా మారబోతున్న రవి తేజా..!

రాజన్న ఆలయంలో పేరుకు పోయిన నాణేలు.. బ్యాంకు కష్టాలు!

ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం : సీఎం జగన్

పోలీసుల చేతిలో ఉన్న లాఠీ గురుంచి ఎన్టీఆర్ మాటలలో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -