Friday, April 26, 2024
- Advertisement -

ప్రొడ్యూసర్ గా మారబోతున్న రవి తేజా..!

- Advertisement -

టాలీవుడ్ కూడా చాలా మంది హీరోలు నిర్మాణ రంగం వైపు కూడా అడుగులు వేస్తున్నారు. సక్సెస్ లు సాధిస్తున్నారు. అలాగే హీరోలకు సొంత బ్యానర్ లు ఉన్నాయి.సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. అలాగే రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో సినిమాలు నిర్మిస్తున్నాడు.

అల్లు వారికి సొంతగా రెండు బ్యానర్లు ఉన్నాయి. మంచు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ ఇలా పెద్ద కుటుంబాలతో పాటు నాని, విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరోలు కూడా నిర్మాతలుగా మారి సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ వంతు వచ్చింది. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న రవితేజ ఇప్పుడు నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నాడు.

ఆర్.టీ.వర్క్స్(RT Works) పేరుతో సొంతంగా బ్యానర్ ను మొదలుపెట్టి సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో తక్కువ బడ్జెట్ లో సినిమాలను నిర్మించాలనుకుంటున్నాడు.టాలెంట్ ఉండి ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూసే నటులు, దర్శకులతో ఈ బ్యానర్ లో సినిమాలు చేయబోతున్నాడు రవితేజ.

ఇప్పటికే రవితేజ అసోసియేట్ ఒకరు కథలు ఉంటే నేరేట్ చేయమని కుర్ర దర్శకులకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే ఈ బ్యానర్ నుండి కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.అయితే ఇందులో కేవలం బయట వాళ్లతోనే సినిమాలు చేస్తారా..? లేక రవితేజ తను నటించే సినిమాలను కూడా నిర్మించుకుంటారో చూడాలి.

రాజన్న ఆలయంలో పేరుకు పోయిన నాణేలు.. బ్యాంకు కష్టాలు!

ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం : సీఎం జగన్

పోలీసుల చేతిలో ఉన్న లాఠీ గురుంచి ఎన్టీఆర్ మాటలలో..!

ఏపీలో ప్రశాంతంగా మూడోదశ ఎన్నికలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -