Thursday, April 25, 2024
- Advertisement -

ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం : సీఎం జగన్

- Advertisement -

ముఖ్యమంత్రి జగన్ విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. ఉక్కు పరిరక్షణ సమితి ప్రతినిధులతో భేటీ అయ్యారు. విశాఖకు వెళ్లిన జగన్ ను నేతలు ఎయిర్ పోర్టులో కలిశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై సీఎంతో చర్చించారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. కార్మిక నేతలు తమ వినతి పత్రాన్ని జగన్ కు అందించారు. ఎన్‌ఎండీసీని విశాఖ ఉక్కుతో అనుసంధానించాలని విజ్ఞప్తి చేశారు.

అనుసంధానం వల్ల సొంత గనుల సమస్య తీరుతుందని వివరించారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని జగన్ చెప్పారని వారు తెలిపారు. కార్మిక నేతలు చెప్పిన వివరాల ప్రకారం దేవుడి ఆశీస్సులతో కేంద్ర ప్రభుత్వం మనసు మారుతుందని భావిస్తున్నట్టు జగన్ చెప్పారు.

ఇక పోస్కో సంస్థతో కడప, భావనపాడు, కృష్ణపట్నంలో పరిశ్రమలను ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు తమ పోరాటం ఆగదని సీఎంకు కార్మిక నేతలు తెలిపారు. మొదటి నుంచి వైఎస్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయంలై కేంద్ర ప్రభుత్వానికి నచ్చజెబుతూ వస్తుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉంటుంది.

కోయ‌కుండానే ఎర్రటి పుచ్చకాయను ఇలా గుర్తించండి !

జ‌క్క‌న్నా.. మ‌జాకా.. విడుద‌ల‌కు ముందే ‘ఆర్ఆర్ఆర్’ రికార్డుల మోత !

విశాఖ ఉక్కు ఉద్యమానికి పల్లా ఊపిరి పోశారు: చంద్రబాబు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -