Tuesday, April 30, 2024
- Advertisement -

రాజన్న ఆలయంలో పేరుకు పోయిన నాణేలు.. బ్యాంకు కష్టాలు!

- Advertisement -

తెలంగాణలో ప్రజలు ఆరాద్య దైవంగా కొలిచే వేములవాడ రాజన్న ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. వేములవాడ రాజన్న ఆలయంలో హుండీలు చిల్లర నాణేలతో నిండిపోయాయి. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు కానుకలను సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. హుండీ ద్వారా సమకూరిన బంగారాన్ని గడిచిన 20 ఏళ్లుగా ఆలయ అధికారులు జాతీయ బ్యాంకుల్లో బాండ్ల రూపంలో డిపాజిట్‌ చేస్తుండగా ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి వడ్డీ వస్తున్నది.

వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల నుంచి కానుకల రూపంలో ఏటా 18 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఇందులో సుమారు 2కోట్ల రూపాయల వరకు చిల్లర నాణేలు ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. కాగా, ఈ మద్య ఆలయంలో డిజిటల్ ద్వారానే లావాదేవీలు నడుస్తున్న విషయం తెలిసిందే.

దాంతో అక్కడ నాణేల వినియోగం తగ్గింది. మరోవైపు బ్యాంకులు చిల్లర నాణేలు డిపాజిట్ చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని తెలిపారు. ఇక జనవరి 27వ తేదీన హుండీలు లెక్కించగా కోటి 50 లక్షల ఆదాయం సమకూరిందని… మరిన్ని హుండీలను నేడు లెక్కిస్తామని ఆలయ కార్యనిర్వాహణాధికారి కృష్ణప్రసాద్ తెలిపారు.

ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం : సీఎం జగన్

పోలీసుల చేతిలో ఉన్న లాఠీ గురుంచి ఎన్టీఆర్ మాటలలో..!

మీరు కారణ జన్ములు.. తెలంగాణకు పండుగ రోజు : హరీష్ రావు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -