Friday, April 26, 2024
- Advertisement -

‘చెక్’ మూవీ నితిన్ కి మైనస్ అయ్యిందా?

- Advertisement -

సంచలన దర్శకుడు తేజ దర్శకత్వంలో ‘జయం’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు నితిన్. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు నితిన్. కానీ కెరీర్ లో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా తన స్టాండ్ నిలుపుకుంటూ వస్తున్నాడు. గత ఏడాది భీష్మ చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు. తాజాగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో “చెక్” సినిమా చేశాడు. ఈ సినిమా పరిస్థితి ఇప్పుడు ఘోరంగా ఉండి నితిన్ కెరీర్ కి పెద్ద మైనస్ లా మారింది..మొదటి వారాంతం గడిచేసరికి నితిన్ సినిమా యావరేజ్ స్థాయి నుంచి ఫ్లాప్ రేంజ్ కు పడిపోయింది.

‘జైలు నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ అంటేనే జనం దూరం జరుగుతున్నారు. భీష్మ లాంటి సక్సెస్ చిత్రంతో దూసుకు పోతున్న నితిన్ ఇలాంటి చిత్రం ఎలా ఒప్పుకున్నాడా అని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. నితిన్ ‘చెక్’కి ఉప్పెన తప్ప గట్టిగా పోటీ ఇచ్చే సినిమా కూడా లేదు. భారీ పోటీ ఉంటే కచ్చితంగా సినిమా కలెక్షన్స్ డల్ అవుతాయి.

కానీ పెద్దగా పోటీ లేకపోయినా కలెక్షన్స్ తగ్గడం అంటే అది నితిన్ కెరీర్ కే పెద్ద మైనస్. దాదాపు 16 కోట్లదాకా బిజినెస్ చేసిన సినిమా కేవలం 7 కోట్లే రాబట్టి నష్టాల పాలయ్యిందట. ఏది ఏమైనా పెళ్లి తర్వాత మొదటి ఫెయిల్యూర్.. మరి ముందు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు అభిమానులు.

‘గజకేసరి’ గా దూసుకొస్తున్న యశ్ !

ఆర్ఆర్ఆర్ యాక్షన్ కు హాలీవుడ్ డైరెక్టర్

రెక్వెస్ట్ కాదు.. వార్నింగ్ : బండి సంజయ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -