Thursday, April 18, 2024
- Advertisement -

బంగారు ప్రియులకు శుభవార్త…!

- Advertisement -

దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరల్లో మార్పు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పసిడి ధరలు దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల బంగారం ధరలు తగ్గాయి. బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వారు కొన్ని రోజులు ఆగితే మంచిది అనే అభిప్రాయం విశ్లేషకుల నుంచి వస్తోంది. ఎందుకంటే బంగారం ధరలు వారు అనుకున్న దానికంటే ఎక్కువగా తగ్గుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,420 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,420 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 42,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,930 ఉంది. విజయవాడలో నేటి ఉదయం నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.43,050 ఉంది. నిన్న ధర రూ.950 తగ్గింది. తులం బంగారం కావాలంటే… దాని ధర రూ.33,680 ఉంది. నిన్న ధర రూ.760 తగ్గింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,210 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,930 ఉంది. నిన్న ధర రూ.1,040 తగ్గింది.

తులం బంగారం కావాలంటే దాని ధర రూ.36,744 ఉంది. నిన్న ధర రూ.832 తగ్గింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,593 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 44,420 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,420 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,540 ఉంది. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి.

‘గజకేసరి’ గా దూసుకొస్తున్న యశ్ !

తెలంగాణ విద్యుత్‌శాఖ‌పై డ్రాగన్ కన్ను!

ఆర్ఆర్ఆర్ యాక్షన్ కు హాలీవుడ్ డైరెక్టర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -