Wednesday, April 24, 2024
- Advertisement -

తిరుపతి ఉప ఎన్నికలను ఛాలెంజింగ్ గా తీసుకున్న వైసీపీ!

- Advertisement -

ఏపీలోని తిరుపతి లోక్‌సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే దీనికి సంబంధించిన ప్రత్యేక షెడ్యూల్‌ విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ పట్టు నిలుపుకునేందుకు గట్టి కృషి చేస్తుంది. మరోవైపు బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సమీకరణలు చేస్తుంది.

మరోవైపు తిరుపతి ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార పార్టీ అన్ని వైపులా సమాయత్తం అవుతుంది. దీనికోసం సీఎం జగన్ మంత్రుల ను ఇంచార్జ్ లు గా నియమించబోతున్నట్లు.. పెద్దిరెడ్డి, బొత్స వంటి సీనియర్లు ఇతర మంత్రులు కలిసి తిరుపతి ఉప ఎన్నికపై దృష్టి పెట్టబోతున్నట్టు సమాచారం. తిరుపతి ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలవాలని వైసిపి పట్టుదల తో ఉంది..గతంలో వచ్చిన మెజారిటీ నిలబెట్టుకోవాలని ఆలోచనలో ఉంది.

ఈ నెల10తో మున్సిపల్ ఎన్నికలు ముగియనున్నాయి. తిరుపతి ఉప ఎన్నికను అధికార పార్టీ సవాల్ గా తీసుకుంది భారీ మెజారిటీతో గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈఎన్నికలో అధికార పార్టీని ఓడించి ఈ ప్రభుత్వం ప్రజలలో విఫలమైందని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ ఉపఎన్నిక ఇటు అధికార పక్షానికి అటు ప్రతిపక్షానికి సవాల్ మారాయి.

‘చెక్’ మూవీ నితిన్ కి మైనస్ అయ్యిందా?

బంగారు ప్రియులకు శుభవార్త…!

‘గజకేసరి’ గా దూసుకొస్తున్న యశ్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -