Sunday, May 19, 2024
- Advertisement -

చిరు సినిమా కు టైటిల్ ఫిక్స్‌!

- Advertisement -

మెగా అభిమానులు ఎంతగానో చిరు 150వ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ నిర్మాణంలో వినాయక్ చిరు సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి చిత్రంను చిరు తెలుగులో రిమేక్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం మొదటి షేడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.

కాకపోతే ఇప్ప‌టి వ‌ర‌కు హీరోయిన్‌, టైటిల్ విష‌యంలో స‌రైన క్లారిటీ లేదు. అయితే ఈ చిత్రం టైటిల్‌పై ఎట్ట‌కేల‌కు క్లారిటీ వ‌చ్చింది. ముందుగా ఈ చిత్రంకు క‌త్తిలాంటోడు టైటిల్ వినిపించింది. అయితే ఆ టైటిల్ ఖ‌రారు కాలేద‌ని,త్వ‌ర‌లోనే టైటిల్ ఎనౌన్స్ చేస్తామ‌ని ఈ చిత్ర నిర్మాత చెర్రీ ప్ర‌క‌టించాడు. తాజాగా ఈ రోజు ఈ సినిమా టైటిల్‌పై ఉన్న స‌స్పెన్స్‌కు తెర‌దించుతూ చిరు 150వ చిత్రానికి టైటిల్ ప్రకటించారు. ఈ సినిమాకి టైటిల్‌ ‘నెపోలియన్’ అని ధృవీకరిస్తూ ‘పోరాటం అతని నైజం’ అనే ఉపశీర్షికను జత చేశారు.

చిరంజీవి అఫిషియల్ ఫేస్‌బుక్ పేజ్‌లో ‘మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం టైటిల్ ఖరారు’ అంటూ టైటిల్‌కు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశారు. ఈ పోస్ట‌ర్ బ్యాక్‌గ్రౌండ్‌లో పొలం దున్నుతున్న రైతుల స‌మ‌స్య‌లలు – వాటిపై చిరు పోరాటం చేసే విధంగా చిత్రాలు ప్ర‌చురించారు. ఈ సినిమా టైటిల్ నెపోలియ‌న్ విష‌యానికి వ‌స్తే నెపోలియ‌న్ ఫ్రాన్స్ దేశాన్ని 14వ శాతాబ్దంలో పాలించిన రాజు పేరు. నెపోలియ‌న్ అంటే నియంతృత్వానికి మారు పేరు కావ‌డం విశేషం. అలాగే నెపోలియ‌న్ పోరాటానికి కూడా మారుపేరు.

Related

  1. చిరు సినిమా షూటింగ్ ఆగిందా?
  2. చిరుతో మెగా హీరోస్ అదిరిపోయే డాన్స్!
  3. చిరు సినిమాలో విజయశాంతి
  4. పూరిని మళ్లీ లైన్‍లో పెట్టిన చిరు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -