Sunday, May 19, 2024
- Advertisement -

‘చూసీ చూడంగానే’ మూవీ రివ్యూ

- Advertisement -

శివ కందుకూరి హీరోగా శేష్ సింధూ రావ్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘చూసీ చూడంగానే’. వర్ష బొల్లమ్మ, మాళవికా సతీశన్ హీరోయిన్లుగా నటించారు. ఈ రోజే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ : సిద్ధూ (శివ) తన మదర్ (పవిత్రా లోకేష్) కారణంగా తనకు నచ్చినట్లు జీవించాలనుకుంటాడు. నచ్చిన కాలేజ్ లో జాయిన్ అవుతాడు. కాలేజీలో ఐశ్వర్య (మాళవికా సతీశన్)తో లవ్ లో పడతాడు. నాళ్లుగేళ్లు ప్రేమలో ఉన్నా తర్వాత ఐశ్వర్య సిద్ధూకి బ్రేకప్ చెబుతోంది. ఆ తర్వాత మూడేళ్లకు సిద్ధూ చివరికి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ లైఫ్ కొనసాగిస్తాడు. ఈ క్రమంలో అతని లైఫ్ లోకి శ్రుతి రావ్ (వర్ష బొల్లమ్మ) వస్తోంది. ఇద్దరు లవ్ లో పడతారు. ఈ క్రమంలో శ్రుతి గురించి సిద్ధూకి ఒక నిజం తెలుస్తోంది. ఆమె కాలేజీ నుండే తనని ప్రేమిస్తోందని తెలుసుకుంటాడు. తనని ప్రేమిస్తోన్నా శ్రుతి ఆ విషయం సిద్ధూకి ఎందుకు చెప్పదు ? శ్రుతికి ఐశ్వర్యకి మధ్య రిలేషన్ ఏమిటి ? వారి మధ్య సిద్ధూకి సంబంధించి జరిగిన గొడవ ఏమిటి ? చివరికి ఏమైంది అన్నదే కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా ఎమోషన్ అలానే లవ్ ఫీలింగ్స్ చూట్టు తిరిగే కథ. డిసెంట్ కామెడీ సినిమాలో ఉంది. ఇక హీరోగా చేసిన శివ కందుకూరి తన పాత్రకు తగ్గట్లు.. లవ్ సీన్స్ లో బాగా చేశాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో కూడా తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రధానంగా క్లైమాక్స్ తో పాటు హీరోయిన్ తో సాగే లవ్ ట్రాక్ లో, అలాగే తనకు తన తల్లి పాత్రకి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ లో మంచి నటుడు అనిపించుకున్నాడు. ఇక హీరోయిన్ గా నటించిన వర్ష బొల్లమ్మ అందంగా కనిపిస్తూ బాగా చేసింది. అలాగే బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించిన మాళవికా సతీశన్ నటన కూడా బాగుంది. తండ్రి పాత్రలో అనీష్, తల్లి పాత్రలో నటించిన పవిత్రా లోకేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకురాలు శేష్ సింధూ రావ్ రాసుకున్న లవ్ సీన్స్ తో పాటు కొన్ని కామెడీ డైలాగ్స్ కూడా బాగున్నాయి. లవ్ డ్రామాను బాగా హ్యాండిల్ చేసింది. గోపిసుందర్ అందించిన సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. నిర్మాత రాజ్ కందుకూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.

మైనస్ పాయింట్స్ : మూవీ ఆసక్తిగా స్టార్ట్ అయినప్పటికి కథనం లోపించింది. అనవసరపు సీన్స్ ఎక్కువయ్యాయి. హీరో పాత్రను కాస్త సినిమాటిక్ గా అనిపిస్తోంది. సినిమాలో బలమైన సంఘర్షణ మిస్ అయింది.

మొత్తంగా : చూసీ చూడంగానే.. ఈ సినిమా ఎమోషనల్ సాగే లవ్ ట్రాక్ అండ్ కొన్నిచోట్ల డీసెంట్ కామెడీతో అలాగే క్లైమాక్స్ సీక్వెన్స్ ఆకట్టుకుంటాయి. కొన్ని చోట్ల కథనం నెమ్మదించడం.. మైనస్ పాయింట్. అయితే హీరో, హీరోయిన్ మధ్య వచ్చే కెమిస్ట్రీ హైలైట్. లవర్స్ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -