నల్లబిల్లి వెంకటేష్ ‘సర్కస్ కార్-2’

- Advertisement -

ఒక రోజు తెల్లారేసరికి ఆ ఊరి పొలిమేరల్లో ఓ కారు కనిపిస్తుంది. ఎన్ని రోజులు గడిచినా ఆ కారు సొంతదారు ఎవరో తెలియదు. ఆ ఊరివారిని సదరు కారు ముప్పుతిప్పలు పెడుతుంటుంది. ఆ కారును ఆశ్రయించి ఉన్న అతీంద్రియ శక్తుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఆ ఊరి వాళ్ళు ఏం చేశారు? ఎన్ని పాట్లు పడ్డారు? వంటి ఆసక్తికర కథ-కథనాలతో రూపొందుతున్న హారర్ ఎంటర్టైనర్ “సర్కస్ కార్-2”. నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో రూపొంది మంచి విజయం సాధించిన “సర్కస్ కార్”కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కూడా యువ ప్రతిభాశాలి నల్లబిల్లి వెంకటేష్ రూపొందిస్తున్నారు.

బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి, మస్త్ అలీ ముఖ్య తారాగణంగా ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ పతాకంపై శివరాజు వికె ఈ హారర్ ఎంటర్టైనర్ నిరిస్తున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరిలోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుపుకుంటోంది.

- Advertisement -

ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ అధినేత శివరాజు వి.కె మాట్లాడుతూ… “సర్కస్ కార్” సాధించిన ఘన విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో మా డైరెక్టర్ నల్లబిల్లి వెంకటేష్… ఈ సీక్వెల్ ను మరింత ఆసక్తిగా తెరకెక్కిస్తున్నారు. దెయ్యాలను ప్రత్యక్షంగా చూడాలని ఆ ఊరి పిల్లలు చేసే ప్రయత్నాలు… వాటి పరిణామాలు పొట్టలు చెక్కలు చేస్తాయి. భయంతో కూడిన వినోదాన్ని పంచే “సర్కస్ కార్-2” మా దర్శకుడు నల్లబిల్లి వెంకటేష్ కి మరింత మంచి పేరు తెస్తుంది. పిల్లల నటన, ఆషు రెడ్డి-గ్లామర్ “సర్కస్ కార్-2″కి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి” అన్నారు.

బేబి శ్రీదేవి, మాస్టర్ రోషన్, మాస్టర్ ధృవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఆర్ట్: బి.ఎస్.జగన్నాధరావు, డి.ఐ: డాలి శేఖర్, మ్యూజిక్: చైతన్య, ఎడిటింగ్: గౌతమ్ కుమార్, కెమెరా: జి.ఎస్.చక్రవర్తి రెడ్డి (చక్రి), నిర్మాత: శివరాజు వి.కె, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నల్లబిల్లి వెంకటేష్!!

సర్జరీతో మరింత అందం పోందిన హీరోయిన్స్ వీరే…!

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

సూపర్ హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -