చంద్రబాబుపై ఫైర్ బ్రాండ్ ఫైర్

- Advertisement -

చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజు మండిపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు భువనేశ్వరి పరువు తీస్తున్నారని విమర్శించారు. తమ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కాని భువనేశ్వరిని ఒక్క మాట కూడా అనలేదని, చంద్రబాబు రాజకీయ లబ్దికోసం తమపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.

మరో వైపు సినీ ఇండస్ట్రీకి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రోజా తెలిపారు. చిరంజీవి కోరిక మేరకే ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం తీసుకొచ్చామని తెలిపారు. సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు వ్యక్తులు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారని పరోక్షంగా పవన్‌ కళ్యాణ్‌ను విమర్శించారు.

- Advertisement -

వైసీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకువచ్చిందన్నారు. ముఖ్యంగా మహిళల భద్రతకు తమ ప్రభుత్వం పెద్దపీఠ వేసిందని ఎమ్మెల్యే అన్నారు. కొందరు వ్యక్తులకు రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టంలేక ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం జగన్‌పై ఉండవల్లి ఫైర్..

కేసీఆర్ పై ఫైర్ అయిన కేంద్ర మంత్రి

ఉప్పు నిప్పు కలిసిన వేళ!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -