రెడ్ అలర్ట్…. ఏపీ,తమిళనాడుకి భారీ వర్ష సూచన!

- Advertisement -

దక్షిణ కోస్తా, రాయలసీమలో మరోసారి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఈ నెల 29న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది బలపడుతూ దక్షిణ కోస్తా సమీపంలోకి వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేటి నుంచి ఈ నెల 30 వరకు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం నెల్లూరు, రాయలసీమ జిల్లాలపై పడే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.

వర్షం ముప్పు నుంచి ఏపీ ప్రజలు తేరుకొని వారం రోజులు కూడా కాలేదు రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ బాంబు పేల్చింది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. జిల్లాలోని నదీ పరివాహక ప్రజలు, ముంపు ప్రాంత ప్రజలు ముందస్తుగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీలో అనేక మంది మృతి చెందారు. ఈ విపత్తును రాష్ట్ర ప్రభుత్వ గమనించలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. వర్షాల సమయంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం బాధితులను అక్కడికి తరలించడంలో విఫలమైందని మండిపడుతున్నారు. ఈ నెల 30 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం తెలపడంతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

తిరుపతిలో మరోవింత!

భగ్గుమంటున్న కూరగాయల ధరలు

అలర్ట్ : కొవిడ్ కొత్త వేరియంట్‌..

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -