అందరికిలో ఒకడిలా కాకుండా అందరిని నడిపించే లీడర్ గా ఉంటారు కొందరు. అలాంటి వ్యక్తే అమీర్ ఖాన్. బాలీవుడ్ లో ఇతర స్టార్ తో పోల్చి చూసినా అమీర్ ఎంతో స్పెషల్. కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అల్లాడిపోతుంది. నిత్యావసరాలు అందక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నరు. అయితే కొందరు రాజకీయ లబ్ధి పొందేందుకు.. ప్రభుత్వాల మెప్పు పొందేందుకు ఒకరు.. ఇలా ఎవరికి వారు ప్రజాసేవ అంటూ నిత్యావసరాల పంపిణీ చేస్తున్నారు.
కానీ వీళ్లందరికి షాక్ ఇచ్చేలా చేశాడు అమీర్ ఖాన్. తిండికి లేక అల్లాడుతున్న అవసరార్థులను ఆదుకునేందుకు అమీర్ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. వారి కోసం గోధుమ పిండి ప్యాకెట్ల సంచులతో ఒక ట్రక్కును పంపారు. COVID-19 సంక్షోభ బాధితులు ఎక్కడున్నారో బాగా గ్రౌండ్ వర్క్ చేసిన అమీర్ తన బుర్రకు పదును పెట్టాడు. ఏప్రిల్ 23 న ఒక ట్రక్ ని డిల్లీలోని ఓ చోట నిరుపేదలు నివశించే ప్రాంతానికి పంపాడు. వాహనం అంతా ఒక కిలో ప్యాకెట్ పిండితో లోడ్ చేసి ఉంది. అయితే కేజీ గోధుమ పిండి ప్యాకెట్ కుటుంబాన్ని ఎన్నాళ్లు ఆదుకుంటుంది అని భావించిన ప్రజలు చాలా మంది అవి తీసుకోలేదు. అయితే తాజాగా రివీలైన ఓ టిక్ టాక్ వీడియోలో ప్యాకెట్లు తీసుకున్నవారు ఆ ప్యాకెట్ ఓపెన్ చేశాక షాక్ కి గురవ్వడం కనిపించింది.
ప్రతి ప్యాకెట్ పిండిలో రూ .15 వేలు నగదును ఉంచారు అమీర్. ఇలా చేయడం వెనుక అమీర్ ఐడియాలజీ బలంగా పని చేసిందనడంలో సందేహమేం లేదు. టిక్ టాక్ వీడియో యాంకర్ ఈ విషయాన్ని ప్రస్థావిస్తూ అమీర్ ఆలోచనను ఆకాశానికెత్తేసింది. డబ్బు నిజంగా పేద ప్రజలకు చేరేలా చేసిన ఏకైక స్టార్ అంటూ పొగిడేసింది. కచ్చితంగా ఇలాంటి టైమ్ లో బాగా కష్టాల్లో ఉన్నవారు మాత్రమే ఒక కిలో పిండి కోసం వరుసలో నిలబడతారు. అంత ఇబ్బంది లేని వాళ్లు క్యూలో ఉండేందుకు ఇష్టపడరు కదా! అని ఆ యాంకర్ చెప్పింది. అయితే ఈ విషయంను అమీర్ గోప్యంగా ఉంచాడు తప్ప ఎక్కడా ఆర్భాటానికి పోలేదు. పబ్లిసిటీ చేసుకోవాలి అనుకోలేదు. ఇలాంటి స్టార్స్ ఉండటం నిజంగా గ్రేట్.
