Monday, May 5, 2025
- Advertisement -

‘సారంగ దరియా’ వివాదం.. శేఖర్ కమ్ముల ఏమన్నారో తెలుసా?

- Advertisement -

ఈ మద్య సినిమాలు రిలీజ్ కాక ముందే అందులో ఏదో ఒక అంశంపై కాంట్రవర్సీలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ’ సినిమాలోని ‘సారంగ దరియా’ పాటపై నెలకొన్న వివాదం సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, మంగ్లీ గాత్రం, సాయి పల్లవి డాన్స్.. ఇలా ఈ పాటలోని ప్రతీది ప్రత్యేంగా నిలిచింది. తాజాగా దీనిపై స్పందించారు దర్శకులు శేఖర్ కమ్ముల. ఈ పాటను సినిమాలోకి ఎలా తీసుకున్నారు.. మంగ్లీతో ఎందుకు పాడించారు వంటి విషయాలపై ఆయన వివరణ ఇచ్చారు. చాలా ఏళ్ళ కిందట ‘రేలా రే రేలా’ ప్రోగ్రాంలో శిరీషా అనే అమ్మాయి ‘సారంగ దరియా’ అనే పాట పాడింది.

ఆ పాట నాకు అలా గుర్తుండిపోయింది. ఆ పాట ఎంత నచ్చింది అంటే అంత నచ్చింది. తన మనసులో అలానే ఉండడంతో ‘లవ్ స్టోరీ’కి తగ్గట్టుగా పాట రాయాలని సుద్దాల అశోక్ తేజను కోరినట్టు శేఖర్ కమ్ముల చెప్పారు. శిరీషతోనే పాటను పాడిద్దామని అనుకున్నామని, అయితే అప్పటికి ఆమె గర్భిణి కావడంతో ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆమెతో చర్చలు ఆపేశామని, దీనికి తోడు కరోనా కారణంగా షూటింగ్ కూడా ఆగిపోయిందని అన్నారు.

ఈ పాటను వెలుగులోకి తీసుకొచ్చిన అమ్మాయి కోమలి కావడంతో ఆమెతో పాడిద్దామని సుద్దాల అన్నారని గుర్తు చేశారు. అందుకు అన్నీ సిద్దం చేశామని అన్నారు. కానీ జలుబు, దగ్గు కారణంగా తాను రాలేనని కోమలి చెప్పారని, మరోవైపు పాట రికార్డింగ్ కోసం సంగీత దర్శకుడు అప్పటికే చెన్నై నుంచి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మంగ్లీతో పాడించామని వివరించారు. తన పేరు వేస్తే అభ్యంతరం లేదని కోమలి చెప్పారని, అయితే, క్రెడిట్‌తో పాటు డబ్బులు కూడా ఇస్తే బాగుంటుందని సుద్దాల సూచించారన్నారు.

దీనికి ఆమె కూడా అంగీకరించారన్నారు. ఈ విషయంలో అమెకు సముచితమైన గౌరవం ఇస్తామని.. ఆడియో ఫంక్షన్‌లో పాడేందుకు కూడా కోమలి అంగీకరించారని, పాట విడుదల చేసినప్పుడు ఆమెకు కృతజ్ఞతలు కూడా చెప్పినట్టు శేఖర్ వివరించారు. కోమలికి తగిన మొత్తం ఇస్తామని, ఆడియో వేడుకకు పిలిచి గౌరవిస్తామని పేర్కొన్నారు.

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్!

“ఓం నమః శివాయ”.. మహాశివరాత్రి విశిష్టత..!

‘కార్తికేయ2’ షూటింగ్ లో గాయపడ్డ నిఖిల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -