Thursday, May 2, 2024
- Advertisement -

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్!

- Advertisement -

తెలుగు దేశం పార్టీకి మరో దెబ్బ పడింది. టీడీపీ అధినేత చంద్రబాబు కి ఇది షాక్ అనే చెప్పాలి. ఓ వైపు ఏపిలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీ తన ప్రాభవాన్ని చాటుకోవడానికి నానా తంటాలు పడుతుంది. ఇదిలా ఉంటే మొన్న జరిగిన పంచాయితీరాజ్ ఎన్నికల్లో వైసీపీ దూసుకు పోయింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో అయిన టీడీపీ తన పరువు కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిన్న పోలీసులకు, ఆయనకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని రవీంద్రపై అభియోగం దాఖలైంది. ఈ మేరకు ఆయన్ను అరెస్ట్‌ చేసిన పోలీసులు గుడూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఇవాళ ఉదయమే రవీంద్ర ఇంటికి పోలీసులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. విషయం తెలుసుకున్న తెదేపా కార్యకర్తలు భారీగా ఆయన ఇంటికి వెళ్లారు. పోలీసులు భారీ బందోబస్తు మోహరించారు.

అక్రమాలపై ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని.. కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ఇదేం న్యాయం అని అడిగినందుకు తనపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. అరెస్టులకు భయపడేది లేదని.. న్యాయం జరిగేవరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

‘కార్తికేయ2’ షూటింగ్ లో గాయపడ్డ నిఖిల్!

రికార్డు రేటింగ్ సాధించిన షాదీ ముబారక్ సినిమా…!!!

పొలవరానికి చంద్ర‌బాబు చేసిన ద్రోహం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -