Friday, April 26, 2024
- Advertisement -

నథింగ్ ఫోన్ లో ధూళి కణాలు.. మళ్ళీ కాంట్రవర్సీ !

- Advertisement -

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బాగా వినిపిస్తున్న పేరు ” నథింగ్ “. మొబైల్ రంగంలో కొత్తగా ఆరంగేట్రం చేసిన ఈ బ్రాండ్ కు ఆది నుంచే ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా నథింగ్ బ్రాండ్ నుంచి వచ్చిన మొదటి ఫోన్ ” నథింగ్ ఫోన్ 1 ” విడుదలకు ముందు చేసిన హంగామా అంతా ఇంత కాదు.. ఫోన్ డిజైన్ యూనిక్ గా ఉండడంతో మొబైల్ ప్రియులు ఈ ఫోన్ కోసం ఎంతో ఎదురు చూశారు. అయితే ఈ ఫోన్ విడుదల అయిన తరువాత సరికొత్త కాంట్రవర్సీ కి తెరతీసింది. ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ .. నార్త్ ఇండియన్స్ మద్య ఈ ఫోన్ పెట్టిన చిచ్చు దేశ వ్యాప్తంగా రెండు రోజుల పాటు తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.. నథింగ్ బ్రాండ్ సౌత్ వారిని చిన్న చూపు చూస్తూ.. రివ్యూ యూనిట్ గా మొబైల్ పంపలేదని కొంత మంది సౌత్ టెక్ యూట్యూబర్స్ :” బాయ్ కాట్ నథింగ్ ” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలిపారు. .

దీంతో ఈ ఇష్యూ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది. ఇక ఈ గొడవ సద్దుమనిగిన తరువాత నథింగ్ పోన్1 మొదటి ఆర్డర్ లో కొన్న వారు.. ప్రస్తుతం ఆ ఫోన్ లోని లోపాలను ఎత్తి చూపుతూ మరో కాంట్రవర్సీ కి తెర తీశారు. నథింగ్ ఫోన్1 ట్రాన్స్పరెంట్ బ్యాక్ ప్యానల్ తో వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఈ ఫోన్ లోపల బ్యాక్ సైడ్ ధూళి కణాలు ఉన్నట్లు కొంత మంది ట్విట్టర్ లో ఆరోపిస్తున్నారు. ఇంతవరకు ఏ స్మార్ట్ ఫోన్ సంస్థ కూడా మొబైల్ ను ట్రాన్స్పరెంట్ గా తయారు చేసేందుకు సాహసించలేదు కానీ నథింగ్ బ్రాండ్ మాత్రం ఆ సాహసం చేసింది. అయితే ఆ బ్రాండ్ చేసిన ఈ సాహసమే ఇప్పుడు లోపంగా మారింది. మొబైల్ కు ఐపీ53 వాటర్ రెసిస్టెంట్ ఉన్నప్పటికి.. మొబైల్ లో ధూళి కణాలు కనిపించడం ఆ బ్రాండ్ పై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉంది.. మరి దీనికి సంభందించి నథింగ్ బ్రాండ్ ఎలాంటి స్పష్టత ఇస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

క్రిప్టో కరెన్సీ బ్యాన్.. సాధ్యం కదా ?

సంక్షోభం గుప్పెట్లో.. మరికొన్ని దేశాలు ?

ప్లాస్టిక్ కు చెక్.. సరికొత్త రోబో టెక్నాలజీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -