Friday, May 17, 2024
- Advertisement -

“ఓం నమః శివాయ”.. మహాశివరాత్రి విశిష్టత..!

- Advertisement -

పరమేశ్వరునికి అత్యంత ప్రియమైనది శివరాత్రి. బ్రహ్మ విష్ణువులకు జ్ఞానబోధ చేయడానికి శివుడు లింగరూపం ధరించిన సమయం శివరాత్రి. భోళా శంకరుడు, అభిషేక ప్రియుడు, నీలకంఠుడు, ఈశ్యరుడు, రాజేశ్వరుడు ఇలా ఎన్నో నామాలు ఆ పరమేశ్వరుడి. మాఘ కృష్ణ చతుర్దశి సమయంలో జరిగింది. కనుకనే మనమంతా ఆ రాత్రిని శివరాత్రిగా జరుపుకుంటున్నాం. ఆ శివరాత్రి మధ్యరాత్రిని లింగోద్భవ కాలం అంటారు. లింగోద్భవ కాలంలో ప్రపంచంలోని సకల తీర్థాలు.. దేవతాంశలన్నీ శివలింగంలో నిలిచి ఉంటాయి. ఈరోజున శివుడికి బిల్వపత్రాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాలాధారణలు, విభూతి ధారణలు శివుడికి సమర్పిస్తుంటాం. శివలింగారాధన అనగానే మనందరికీ అనేక పుణ్యక్షేత్రాలు.. గొప్ప పూజలు.. అభిషేకాలు.. యజ్ఞాలు తలంపుకు వస్తాయి.

శివరాత్రి సమయంలో ఎనిమిది జాములలో వీలుకాకపోతే ఆరు జాములలో శివార్చన చేయాలని శాస్త్రవచనం. (ఒకరోజుకు ఎనిమిది జాములు. పగలు నాలుగు జాములు.. రాత్రి నాలుగు జాములు. మన కలగణనలో నాలుగు గంటలు) శివరాత్రి ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రంతా శివనామస్మరణతో జాగరణ చేయాలి. శివ నామాన్ని ఒక్కసారి కీర్తించినంత మాత్రం చేత మానవులు ఏడు జన్మలలో ఎప్పుడెప్పుడు చేసి ఉన్న ఏ పాపాలనుండి అయినా అతిశీఘ్రంగా విముక్తి పొందుతాడు.

బుద్ధిమంతుడు ‘శి–వ’ అనే ఈ రెండక్షరాలనూ సదా ఉచ్చరిస్తూ సంసార సాగరాన్ని అవలీలగా దాటేసి, శివ సాయుజ్యం పొంది తీరుతాడు. పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి, సమర్పణల ద్వారా జరుపుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం, రాత్రి అంతా జాగరణ చేసారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈ రోజు శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలు చేసి,ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు . రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు.

అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది . పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రములో విపులంగా వర్ణించాడు. శైవులు ధరించే భస్మము/విభూతి తయారుచేయటానికి ఈనాడు పవిత్రమైనదని భావిస్తారు. రోజు అంతా భక్తులు “ఓం నమః శివాయ”, శివ యొక్క పవిత్ర మంత్రం పఠిస్తారు.

‘కార్తికేయ2’ షూటింగ్ లో గాయపడ్డ నిఖిల్!

పొలవరానికి చంద్ర‌బాబు చేసిన ద్రోహం

మహేష్ తో మూడు సంవత్సరాలు సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్న రాజమౌళి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -