Sunday, April 28, 2024
- Advertisement -

అభివృద్ది పేరుతో దోచేస్తారా.. జగన్ సార్ ?

- Advertisement -

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరవాత విశాఖపట్నంలోని రుషికొండ తరచూ వార్తల్లో నిలుస్తోంది. రుషికొండపై తవ్వకాలు చేస్తూ.. ప్రకృతి అందాలను నాశనం చేస్తోందని జగన్ సర్కార్ పై విమర్శలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. వైఎస్ జగన్ ఏదో ఆశించే రుషికొండపై తవ్వకాలు జరుపుతున్నారని.. అక్రమంగా ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని టీడీపీ. జనసేన పార్టీలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రుషికొండ అక్రమ తవ్వకాలపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు స్పందించింది. అభివృద్ది పేరుతో కొండను దోచేస్తారా ? అంటూ ప్రశ్నించింది. కేంద్ర అటవీశాఖ ఆధ్వర్యం రుషికొండ తనిఖీ కోసం కమిటీ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెబుతోందంటూ హైకోర్టు ఆగ్రహించింది.

ప్రభుత్వ వైఖరి చూస్తుంటే రుషికొండ తవ్వకాల విషయంలో ఏదో దాస్తుందనే అనుమానాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది. రుషికొండ విషయంలో తవ్వకాలకు 9.88 ఎకరాలకు మాత్రమే అనుమతి ఉందని, కానీ ప్రభుత్వం మాత్రం 20 ఎకరాల మేర తవ్వకాలు జరిపిందని పిటిషన్ తరుపు న్యాయవాదులు వాదించారు. అందుకు సంబంధించిన గూగుల్ మ్యాప్ ఆధారాలను కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా కు సమర్పించారు. అయితే అలాంటిదేమీ లేదని కేవలం 9.88 ఎకరాలకు మాత్రమే తవ్వకాలు జరిగాయని ప్రభుత్వ తరుపు న్యాయవాది నిరంజన్ రెడ్డి ఖండించినప్పటికి… గూగుల్ మ్యాప్ కూడా అబద్దం చెబుతాయా అంటూ ప్రభుత్వ తరుపు న్యాయవాదిని జస్టిస్ ప్రశ్నించారు. దీంతో అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరగా.. తదుపరి విచారణను నవంబర్ 3 కు వాయిదా వేసింది హైకోర్టు. మరి రుషికొండ అక్రమ తవ్వకాల విషయంలో జగన్ సర్కార్ పై ఎదురవుతున్న ఆరోపణలు ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే హైకోర్టు తదుపరి విచారణ వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.

Also Read

మోడీకి దేశంపై ప్రేమ లేదా ?

జగన్ కు సర్పంచులు షాక్ ఇవ్వనున్నారా ?

పవన్ ప్రశ్నలకు సమాధానమేది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -