Wednesday, May 1, 2024
- Advertisement -

రాజమౌళి.. తెలుగు సినీ “చరిత్రకోకడు”

- Advertisement -

తెలుగు సినీ చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే.. ఒకప్పటి తెలుగు సినిమా, ప్రస్తుతం తెలుగు సినిమాకు చాలానే తేడా ఉందనే చెప్పాలి. ఒకప్పుడు తెలుగు సినిమాలు కేవలం తెలుగు భాష వరకు మాత్రమే పరిమితం. కానీ ఇప్పుడు భాష వ్యత్యాసం లేకుండా ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు మన దేశంలోని హిందీ ప్రేక్షకుల్లో కూడా తెలుగు సినిమాపై చిన్న చూపు ఉండేది. కానీ ఇప్పుడు హిందీ ప్రేక్షకులే తెలుగు సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. దినంతటికి కారణం ఎవరో మనందరికి తెలుసు.. ఆయనే దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. నేడు ( అక్టోబర్ 10 ) ఎస్ ఎస్ రాజమౌళి పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన సాధించిన విజయాలు, ప్రపంచ స్థాయి గుర్తింపు, తెలుగు సినిమాకు తెచ్చిన గౌరవం వంటి అంశాలను కాస్త తెలుసుకుందాం !

కర్నాటకలోని రాయచూర్ జిల్లాలో మాన్వి అనే గ్రామంలో 1973 అక్టోబర్ 10న ఎస్ ఎస్ రాజమౌళి జన్మించారు. తండ్రి విజయేంద్ర ప్రసాద్, తల్లి రాజ నందిని. రాజమౌళి కర్నాటకలో జన్మిచ్చినప్పటికి వీరు తెలుగువారే. వీరి కుటుంబం ఆంద్రప్రదేశ్ లోని రాజమండ్రి సమీపంలో ఉన్న కొవ్వూరు గ్రామానికి చెందిన వారు. రాజమౌళి అసలు పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. రాజమౌళికి చిన్నతనం నుంచే జానపద, చారిత్రక, ఫాంటసీ కథలపై మక్కువ ఏర్పడింది. ఆయన అమ్మమ్మ రాజమౌళికి చిన్నతనంలో రామాయణం, మహాభారతం, భాగవత పురాణం వంటి గ్రంధాలను కథల రూపంలో చెప్పడం వల్ల వాటిపై రాజమౌళికి అమితమైన ఆసక్తి ఏర్పడింది. .

ఇక తన తండ్రి సినీ రైటర్ గా చలన చిత్రారంగంలో పని చేస్తుండడంతో తనకు కూడా సినీరంగంపై ఆసక్తి పెరిగింది. మొదట్లో కొంతకాలం ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావ్ వద్ద శిష్యరికం చేశాడు. ఆ తరువాత దర్శకత్వంపై మక్కువ పెంచుకొని.. చిన్న చిన్న ప్రకటనలకు, టీవి సిరియల్స్ కు దర్శకత్వం వహించాడు. ఇక 2001 లో జూ. ఎన్టీఆర్ హీరోగా తన మొదటి సినిమాకు దర్శకత్వం వహించారు రాజమౌళి. ఈ సినిమాకు కే. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఇక ఆ తరువాత తన రెండవ చిత్రం ” సింహాద్రి ” కూడా జూ. ఎన్టీఆర్ తోనే చేసి సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఇక అప్పటినుంచి రాజమౌళి వెనుదిరిగి చూసుకోలేదు. సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, ఈగ, మర్యాద రామన్న, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్,ఆర్ ఆర్ ఆర్. ఇలా అన్నీ చిత్రాలు కూడా ఒకదాన్ని మించి మరొకటి హిట్ అవుతూ తెలుగు సినీ ఖ్యాతిని పెంచుతువచ్చాయి.

ముఖ్యంగా బాహుబలి సిరీస్ తో అంతర్జాతీయంగా తెలుగు సినిమా గౌరవాన్ని పెంచారు రాజమౌళి. ఇక ఇప్పటివరకు ఆయన మూడు జాతీయ అవార్డులు, నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, ఐదు నంది అవార్డులు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన విశేష కృషికి గాను 2016 లో భారత ప్రభుత్వం ” పద్మశ్రీ ” తో సత్కరించింది. ఇక ఆయన తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయనున్నారు. ఆఫ్రికన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ చిత్రంగా..ప్రపంచ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సినిమాతో ఆయన తెలుగు సినీ గౌరవాన్ని ప్రపంచస్థాయిలో వ్యాపింపజేయాలని కోరుకుందాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -