Monday, May 6, 2024
- Advertisement -

ఫేస్ బుక్ వల్ల అమ్మానాన్నలపై కేసు పెట్టిన కూతురు!

- Advertisement -

ప్రస్తుతం సోషల్ మీడియాని జనాలు తెగ వాడేస్తున్నారు. ప్రతి నిమిషయం ఏం అయిందో అప్ డేట్స్ పోస్ట్ చేయడం వంటివి చాలా మంది చేస్తున్నారు. ఏం చేసిన, ఎక్కడ ఉన్న ఓ ఫొటో క్లిక్ మనిపించడం దానిని వెంటనే అప్ లోడ్ చేయడం వంటివి చేస్తున్నారు. ఆస్త్రియాకు చెందిన ఇలాంటి ఉత్సాహవంతులే ఇప్పుడు ఓ చిత్రమైన సమస్యలో ఇరుకున్నారు.

సొంత కూతురే కేసు పెట్టడంతో షాక్ అయ్యారు. అసలు విషయంలోకి వెళ్తే… వియన్నాను చెందిన దంపతులు తమ కూతురు చిన్ననాటి ఫొటోలను ఉత్సాహంగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. 2009 నుండి దాదాపు 500 ఫోటోలను వారు ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు. ఈ ఫోటోలలో చాలా వరకు అభ్యంతరకరమైనవి ఉన్నాయట. వీటిని వెంటనే తీసేయాలి అని ప్రస్తుతం 18ఏళ్లున్న ఆ అమ్మాయి కోరింది.

 అయితే ఆ ఫోటోలను డిలీట్ చేయడానికి అమ్మానాన్నలు ఒప్పుకోకపోవడంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టింది.  తన మనోభావాలను పట్టించుకోకుండా తన చిన్ననాటి ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేశారని బాధితురాలు వాపోతోంది టాయ్ లెట్ లో ఉన్నవీ, బెడ్ పై నగ్నంగా ఉన్నవీ ఫేస్ బుక్ లో పెట్టేశారని ఆ ఫొటోలు చూస్తుంటే తలెత్తుకోలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. తనకిష్టం లేకుండా తన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో పాటూ తనను క్షోభకు గురిచేస్తున్న చిత్రాలను తొలగించేందుకు తల్లితండ్రులు నో చెప్పడంతో అమ్మాయి కేసుల వరకూ వెళ్లిపోయింది. ఈ కేసు నవంబర్ లో విచారణకు రానుంది.

Related

  1. ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు అని పిచ్చ కొట్టుడు కొట్టారు
  2. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చనిపోయే ముందు ఫేస్ బుక్ లో గొప్ప పని చేసాడు
  3. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి భారీ జరిమానా చెల్లించుకున్నాడు
  4. మీకు ఫేస్ బుక్ ఉందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -