Monday, April 29, 2024
- Advertisement -

ప్రభుత్వానికి దిమ్మతిరిగే దెబ్బ కొట్టిన జియో .. ఎంత నష్టమో తెలుసా..?

- Advertisement -
Effect Of Jio Government Lossed Lot Of Money

టెలికాం రంగంలోకే రిలయన్స్ జియో పెద్ద సంచలనం రేపిన విషయం తెలిసిందే. అద్భుతమైన ఆఫర్స్ తో ఎక్కువ మంది కస్టమర్స్ ను దక్కించుకుంది. జియో రావడంతో టెలికాం కంపెనీలకే కాకుండా ప్రభుత్వానికి కూడా భారీగానే నష్టం వచ్చింది. జియో ఫ్రీ డేటా, ఫ్రీ వాయిస్ కాల్స్ ఇవ్వడంతో ప్రభుత్వం రూ.685 కోట్లను నష్టం పోవాల్సి వచ్చిందని టెలికాం కమిషన్ తెలిపింది. నిర్దేశించిన సమయానికి మించి ఆఫర్లను అందిస్తుండటంతో సెక్టార్ నష్టపోతున్నట్టు పేర్కొంది.  

ఈ విషయంపై తొలి సారి స్పందించిన టెలికమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్, జియో బ్యాక్ టూ బ్యాక్ ప్రమోషనల్ ఆఫర్లు,  ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో ప్రభుత్వంపై పడిన ప్రభావాన్ని వివరించింది. పరిశ్రమ వృద్ధికి తోడ్పడేలా ప్రస్తుత నిబంధనలను సమీక్షించాలని, ప్రమోషనల్ టారిఫ్లకు సంబంధించిన ఆదేశాలు తూచా తప్పకుండా అమలయ్యేలా చూడాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కి కమిషన్ సూచించింది. జియో ఆఫర్స్ సెప్టెంబర్ 5 నుంచి మొదలు అయ్యింది.

దాంతో ఇతర కంపెనీలు తమ కస్టమర్లను కాపాడుకోవడానికి భారీగా రేట్లు తగ్గిస్తూ వస్తున్నాయి. దాంతో వారి రెవెన్యూకు భారీగా దెబ్బ పడింది. కంపెనీల రెవెన్యూలను ఆధారంగానే ప్రభుత్వం లైసెన్సు ఫీజులను, స్పెక్ట్రమ్ ఛార్జీలను వసూలు చేస్తోంది. ప్రస్తుతం వీటి రెవెన్యూలు పెద్దగా లేకపోవడంతో ప్రభుత్వానికి కూడా నష్టాలు పెరిగిపోతున్నాయి. టెలికాం కంపెనీల రెవెన్యూలు మరో 8-10 శాతం క్షీణించే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం 2002, 2008 నిర్ణయించిన ప్రమోషనల్ ఆఫర్లను ట్రాయ్ కచ్చితంగా అప్లయ్ చేయాలని ఆదేశించింది. ట్రాయ్ 2002లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రమోషనల్ ఆఫర్ 90 రోజులకు మించి ఉండకూడదు. కానీ ఉచిత ఆఫర్లను వివిధ పేర్లతో జియో పొడిగిస్తూ వస్తోంది. 

Related

  1. షాకింగ్ : జియో సిమ్ లతో భారీ మోసం.. బయట పెట్టిన పోలీసులు
  2. ఇలాంటి ఆఫర్ మరోకటి ఉండదు.. సూపర్ ఆఫర్ ఇచ్చిన జియో
  3. జియో వల్ల వారికి ఎంత లాభమో తెలిస్తే షాకే!
  4. జియో.. మార్చి ఆఫర్ తర్వాత ఆఫర్ ఇదే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -