- Advertisement -

ఉల్లాసంగా ఉత్సాహంగా హీరో ఎలా చనిపోయాడో తెలుసా..?

- Advertisement -
Do You Know How Yasho Sagar Dead

ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో హీరోగా పరిచయం అయిన యశో సాగర్ గుర్తున్నాడా. మొదటి చిత్రంతోనే మంచి నటన కనబర్చి.. తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. దాంతో యశో కెరీర్ అద్భుతంగా ఉంటుందని అంతా భావించారు. కామెడీతో పాటు సీరియస్ పాత్రల్లో కూడా ఇతడు మంచి నటనను కనబర్చుతాడు అని అంతా అనుకున్నారు.

కన్నడకు చెందిన ప్రముఖ నిర్మాత తనయుడు అయిన యశోసాగర్ అర్థాంతరంగా చనిపోయాడు. యాక్సిడెంట్ లో చనిపోయిన యశోసాగర్ ను ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, సినిమా పరిశ్రమకు చెందిన వారు మరియు ప్రేక్షకులు కూడా మర్చి పోలేక పోతున్నారు. ఇంతకు యశోసాగర్ ఎలా చనిపోయాడో తెలుసా? యశోసాగర్ టైం బాగా లేక పోవడంతో విమానంలో ప్రయాణించాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల ఆ రోజు రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. 2012 డిసెంబర్ 24న బెంగళూరు నుండి హైదరాబాద్ రావాల్సిన విమానంను మిస్ అయ్యాడు.

దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్నేహితులతో కలిసి కారులో అర్థరాత్రి హైదరాబాద్ బయలు జేరాడు. అర్థరాత్రి సమయం కావడంతో డ్రైవర్ కారును సరిగా డ్రైవ్ చేయలేక పోయాడు. బెంగళూరు నుండి బయలుజేరిన నాలుగు గంటల తర్వాత కారు రోడ్డు పక్కన ఉన్న ఒక రాతి దిమ్మెకు గుద్దుకుంది. దాంతో అక్కడిక్కడే యశో సాగర్ మరియు అతడి స్నేహితులు దారుణంగా మృతి చెందారు. అతి వేగం కారణంగానే కారుకు ప్రమాదం జరిగినట్లుగా విచారణలో వెళ్లడైంది. 

Related

  1. ‘బాహుబలి’లో ఎవరు ఎవరు ఎంత తీసుకున్నారో తెలుసా..?
  2. పెద్ద దొంగని పట్టించిన బాహుబలి మూవీ.. ఎలానో తెలుసా..?
  3. బాహుబలి లో కనించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా..?
  4. భర్తకు తెలియకుండా కులుకుతున్న హీరోయిన్.. భర్త ఏం చేసాడో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -