ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ అంటేనే యామి గౌతమ్. యామి గౌతం అంటే ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ గుర్తొస్తుంది. ఈ యాడ్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన యామి గౌతమ్ తర్వాత పలు సినిమాలలో సందడి చేశారు. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా కన్నడ చిత్రాలతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమాకే ఫిలింఫేర్ అవార్డ్ దక్కించుకోవడం ఎంతో విశేషమని చెప్పవచ్చు.
ఈ విధంగా పలు భాషలలో నటిస్తూ మంచి ఆదరణ దక్కించుకున్న యామిగౌతమ్ శుక్రవారం బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యతో మూడు ముళ్ళు వేయించుకున్న ఈ విషయాన్ని యామిగౌతమ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశారు.ఈ క్రమంలోనే తన వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్న అంటూ తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also read:వామ్మో ..ప్రభాస్ ఆది పురుష్ రెమ్యూనరేషన్ తెలిస్తే కళ్ళు తిరిగిపోవాల్సిందే!
హల్దీ వేడుకతో పాటు పెళ్లికి సంబంధించిన ఫోటోలను కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె భర్త ఆదిత్య ప్రస్తుతం‘ఉరి: ద సర్జికల్ స్ట్రైక్’ డైరెక్టర్.. ప్రస్తుతం ఇతడు విక్కీ కౌశల్ హీరోగా ‘ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు.
Also read:రాజమౌళి షార్ట్ ఫిలిం.. ఆర్ఆర్ఆర్ కంటే ముందే విడుదల!