- Advertisement -

డైరెక్టర్ గా మారబోబోతున్న ఫైట్ మాస్టర్ సెల్వా….!!!!

- Advertisement -

సాధారణంగా సినిమాల్లో టెక్నీషియన్‌గా పని చేస్తూ… దర్శకుడిగా మారి సినిమాలు చేసిన టెక్నిషియన్లు చాలామంది ఉన్నారు.చాలా మంది కెమెరామెన్‌లు డైరక్టర్లు అయ్యారు, డ్యాన్స్ మాస్టర్లు దర్శకులయ్యారు, ఫైట్‌ మాస్టర్లు కూడా మెగాఫోన్లు పట్టుకున్నారు.రాఘవ లారెన్స్ కాని, ప్రభు దేవా కాని కొరియోగ్రాఫర్ల నుంచి డైరెక్టర్ లలా మారిన వారు చాలా మందే వున్నారు.

ఇప్పుడు ఇదే దారిలో మరో యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ జాయిన్ అవ్వబోతున్నాడు..ఇప్పుడు ‘యాక్షన్‌ – కట్‌’ చెప్పడానికి రెడీ అవుతున్నారు. దక్షిణాదిలో స్టార్‌ ఫైట్‌ మాస్టర్‌గా వెలుగొందుతూ, అప్పుడప్పుడు నటించే సెల్వ ఇప్పుడు దర్శకుడిగా మారబోతున్నారట. అన్నట్లు విలన్‌గా కూడా కొన్ని సినిమాలు చేశాడు సెల్వ.

తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఇప్పటివరకు సెల్వ 100 సినిమాల్లో పైగా నటించాడు.చాలా సినిమా యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా చేశాడు. ప్రముఖ దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ అందిస్తున్న ఓ కథతో దర్శకుడిగా మారబోతున్నాడట. ఓ ప్రముఖ నిర్మాత ఈ సినిమాను నిర్మిస్తారట. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రాబోతోందని తెలుస్తోంది. సినిమా పూర్తి వివరాలను అధికారికంగా త్వరలో తెలపనున్నారు.

ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్ కి..చెన్నై సూపర్ కింగ్స్ బలే రేటు..!

మ్యాక్స్​వెల్ కి భారీ రేటు..బెంగుళూరు జోరు..!

‘నూటొక్క జిల్లాల అందగాడు’.. వ‌చ్చెస్తున్నాడు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -