నల్గొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ తరుఫున రాములు నాయక్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. పట్టభద్రులు, నిరుద్యోగులను ఓట్లు అడిగే అర్హత కేసీఆర్‌కు లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో రాములు నాయక్ విజయం ఖాయమని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు.. టి.ఆర్.ఎస్ పాలనకు నిదర్శనమన్నారు.
టీఎస్‌పీఎస్సీలో 11మంది ఉండాల్సింది… ఇద్దరితోనే నడిపిస్తున్నారని చెప్పారు. నిరుద్యోగ భృతి అమలయ్యే వరకు.. టి.ఆర్.ఎస్ ను చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. 7.5 శాతం ఫిట్‌మెంట్ అంటే ఉద్యోగులను అవమానించడమేనని స్పష్టం చేశారు.
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ తెలంగాణకు రూపాయి మేలు కూడా చేయలేదన్నారు. విభజన చట్టంలోని హామీలను పట్టించుకోలేదని ఉత్తమ్ మండిపడ్డారు.
మ్యాక్స్వెల్ కి భారీ రేటు..బెంగుళూరు జోరు..!
ఐపీఎల్ 2021 మినీ వేలం : కొత్త రికార్డు సృష్టించిన క్రిస్ మోరిస్.. ఏకంగా రూ.16.25 కోట్లు
