చిన్న తల ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ పై సంచలన వ్యాఖ్యలు..!

టీమిండియా మాజీ క్రికెటర్లు ఎమ్మెస్ ధోనీ, సురేష్ రైనా ప్రాణ స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఇండియన్ క్రికెట్ లోకి ఇంచుమించు ఒకేసారి అరంగేట్రం చేశారు. ధోని 2004లో వన్డేల్లో అరంగేట్రం చేయగా, 2005లో సురేష్ రైనా వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. జట్టులోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఇక ధోని కెప్టెన్ అయిన తర్వాత సురేష్ రైనాను ఆటగాడిగా అతడిని ఎంతో ప్రోత్సహించాడు. వీరిద్దరూ కలిసి టీమిండియాకు ఎన్నో విజయాలు అందించారు.

ఐపీఎల్ లో కూడా వీరిద్దరూ 2008 నుంచి ఒకే జట్టుకు ఆడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా ధోని ఉండగా, ఆ జట్టులో కీలక ఆటగాడిగా సురేష్ రైనా వ్యవహరిస్తున్నాడు. కాగా గత ఏడాది స్వాతంత్ర దినోత్సవం రోజు ధోనీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయం తెలిసిన కొద్ది క్షణాల్లోనే సురేష్ రైనా కూడా ప్రెస్ మీట్ పెట్టి అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ధోని అంటే తనకు ఎంతో అభిమానమో చాటుకున్నాడు.

క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీకి ఇక ఈ ఏడాది జరిగే ఐపీఎలే చివరిదని, ఆ తర్వాత సీజన్ ఆడడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సురేష్ రైనా ఓ న్యూస్ చానెల్ తో మాట్లాడుతూ వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో ధోని ఆడకపోతే , తాను కూడా ఆడనని సంచలన ప్రకటన చేశాడు.

ఒకవేళ వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిస్తే… ఆ తర్వాతి సీజన్లో కూడా ధోని ఆడేలా తాను ఒప్పిస్తానని సురేష్ రైనా అన్నాడు. నాకింకా మరో నాలుగైదేళ్లు క్రికెట్ ఆడే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మరో రెండు కొత్త జట్లు ఐపీఎల్లో ఆడనున్నాయి. నేను క్రికెటర్ గా చివరి క్షణం వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాలనుకుంటున్నా. ఒకవేళ వచ్చే ఏడాది ధోని ఆడకుంటే నేను కూడా క్రికెట్ నుంచి తప్పుకుంటా. ధోని ఐపీఎల్ నుంచి తప్పుకుంటే, నేను మరో ఐపీఎల్ జట్టు తరపున ఆడతానని అనుకోను’ అని రైనా వ్యాఖ్యానించాడు.

Related Articles

Most Populer

Recent Posts