Tuesday, April 16, 2024
- Advertisement -

Zika Virus: జికా వైరస్ ఎలా సోకుతుంది? లక్షణాలు ఏమిటి?

- Advertisement -

ఇప్పటికే కరోనా వైరస్​తో ప్రపంచదేశాలన్నీ తలకిందులవుతున్న వేళ.. మనదేశంలోని కేరళ రాష్ట్రంలో వైద్య నిపుణులు మరో వైరస్​ను గుర్తించారు. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం జికా వైరస్​ కలకలం రేపుతున్నది. తిరువనంతపురం జిల్లాలో దాదాపు 13 జికా కేసులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. పుణెలోని నేషనల్‌ వైరాలజీ ల్యాబ్‌కు 19 శాంపిళ్లను పంపించగా.. 12 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అంతకుముందు 24 ఏళ్ల గర్భిణిలో ఈ వైరస్‌ తొలిసారి వెలుగు చూసింది. ఈ నెల 7న ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది కూడా. బిడ్డలో వైరస్‌ లక్షణాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఎలా సోకుతుంది?
జికా వైరస్​ ఏడెస్​ అనే దోమ నుంచి మనుషులకు సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వైరస్​కు ఇప్పటివరకు చికిత్స లేదు. 1947లో ఉగాండా అడవుల్లోని కోతుల్లో ఈ వైరస్ ను గుర్తించారు. 2017లో అహ్మదాబాద్‌, తమిళనాడులో ఈ కేసులు వెలుగుచూశాయి.

లక్షణాలు ఏమిటి?
జికా వైరస్​ ప్రాణాంతకం ఏమీ కాదని డాక్టర్లు అంటున్నారు. అయితే దోమల ద్వారా ఈ వ్యాధి తొందరగా వ్యాపించే అవకాశం ఉందని.. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. జ్వరం, శరీరంపై దద్దుర్లు ఏర్పడే అవకాశం ఉంది. తలనొప్పి, ఒళ్లునొప్పులు కనిపించే అవకాశం ఉంది. ఇక చిన్నపిల్లలను జాగ్రత్తగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యాధి పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Also Read

ఫైజర్​కు తిరుగులేదట.. తాజా అధ్యయనం

జనాలు ఓటీటీలకు అలవాటయ్యారా?

తిరుమలకు శుభలేఖ పంపితే.. టీటీడీ బహుమానాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -