Wednesday, May 22, 2024
- Advertisement -

సాయి ధరమ్ తేజ్ లవ్ చేసింది ఏ అమ్మాయినో తెలుసా?

- Advertisement -
Foreign Beauty Rejects Sai Dharam Tej Love

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఏ హీరోయిన్ తో నటిస్తే ఆ హీరోయిన్ తో లింక్ ఉందంటూ రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మెగా హీరో కూడా తన స్పీడ్ ను ప్రతి హీరోయిన్ వద్ద ప్రదర్శిస్తూ అనేక రూమర్స్ రావడానికి ఆస్కారం ఇస్తూ ఉంటాడు. గతంలో రెజీనా.. తాజాగా.. రకుల్ ఇలా సాయి ధరమ్ తో గాసిప్పు వార్తలతో చిక్కుకున్న వారే.

గత వారం రిలీజ్ అయిన ‘విన్నర్’ మూవీ ప్రమోషన్ లో సాయి ధరమ్ తేజ్ ఇంటర్వ్యూ ఇస్తూ.. తను చదువుకునే రోజులలో తనకు తారస పడ్డ అమ్మాయిల దగ్గర నుంచి ఇప్పుడు తనతో నటిస్తున్న హీరోయిన్స్ వరకు తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని వివరిస్తూ తన రొమాంటిక్ టచ్ ని చాటుకుంటున్నాడు. ఇప్పటివరకు రెజీనా, రకుల్ తో వచ్చిన తన ప్రేమ కథలకు ఈ మెగా మేనల్లుడు బయట పెట్టాడు. అయితే ఈ సారి ధరమ్ తేజ్ ప్రేమలో చిక్కుకుంది ఒక ఫారెన్ బ్యూటి.

‘తిక్క’ మూవీలో సాయి ధరమ్ తేజ్ తో నటించిన బ్రెజిల్‌ భామ లారిసా బొనేసి కి ఆమె అడగకుండానే తనకు తానే ప్రపోజ్ చేసాడట తేజ్. అయితే ఈ అనుకోని ప్రపోజల్ కు షాక్ అయిన లారిసా తనకు బ్రెజిల్‌ లో తనను ఇప్పటికే ప్రేమిస్తున్న ఒక ప్రేమికుడు ఉన్నాడు అన్న విషయాన్ని బయట పెట్టి ఈ మెగా యంగ్ హీరో మైండ్ బ్లాంక్ చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా సాయి ధరమ్ తేజ్ చెప్పాడు. అయితే సాయి ధరమ్ కేవలం తన క్రేజ్ పెంచుకోవడానికి ఇలాంటి లవ్ స్టోరీ క్రియేట్ చేసి చెప్పాడని మరికొందరు ఈ మెగా యంగ్ హీరో పై సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా ఈ మెగా యంగ్ హీరో స్పీడ్ చూస్తూ ఉంటే ఎవరో ఒకర్ని ప్రేమించి పెళ్ళి చేసుకోవడం ఖాయం అని అనిపిస్తోంది. 

Related

  1. హీరోగా సాయిధరమ్‌ తమ్ముడు..
  2. సాయి పల్లవి మాయలో పడ్డ నాని!
  3. నైట్ ఆ హీరోయిన్‌తో అడ్డంగా దొరికిపోయిన సాయిధ‌ర‌మ్‌
  4. సొంత కూతురిపై రేప్ చేసిన కసాయి తండ్రి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -