Friday, April 26, 2024
- Advertisement -

విమర్శలకు చెక్ పెట్టిన సార్ట్స్

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన ట్విటర్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశాడు. ‘గాడ్ ఫాదర్ చిరంజీవి, ‘భీమ్లా నాయక్ పవన్ కల్యాణ్ ఈ ఇద్దరూ ఇటీవల ఒకరి మూవీ సెట్స్‌లో మరొకరు సందడి చేసిన వీడియోను రామ్ చరణ్ పంచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’. తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం సెట్స్ మీదున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం చిరంజీవి పై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్లో చిరంజీవిపై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఖైదీ డ్రెస్ లో చిరు ఈ ఫైట్ చిత్రీకరణలో పాల్గొనడం విశేషం. అయితే అదే సమయంలో ఈ మూవీ సెట్లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడుగుపెట్టడం విశేషాన్ని సంతరించుకుంది. పవన్ తో చిరు కొద్దిసేపు ముచ్చటించారు. ఇక ఆ తర్వాత పవర్ స్టార్ ‘భీమ్లానాయక్’ సెట్స్ లోకి కూడా చిరంజీవి అడుగుపెట్టి.. అక్కడి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. పవన్ ని ఆప్యాయంగా కౌగలించుకున్నారు.

అక్కడ ఈ ఇద్దరూ కొంతసేపు ముచ్చటించుకున్నారు. అన్నదమ్ములిద్దరూ ఇలా ఒకరి సెట్స్ లోకి మరొకరు వెళ్ళి తమ అనుబంధాన్ని మరోసారి చాటుకోవడంతో అభిమానులు మురిసిపోతున్నారు. ఏపీ ఆన్ లైన్ టికెటింగ్ వ్యవహారంలో.. చిరు, పవన్ మధ్య మనస్ఫర్ధలొచ్చాయని మీడియాలో వచ్చిన వార్తలకు అన్నదమ్ములిద్దరూ ఇలా చెక్ పెట్టారు. దీంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పాన్ ఇండియా స్టార్ కు సూపర్ స్టార్ సాయం..

నాని నవ్వుల హోం మొదలైంది

స్పైసీగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న మ‌ల్లు బ్యూటీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -