Friday, April 26, 2024
- Advertisement -

అధికారుల అత్యుత్సాహమే కారణం

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్‌లో కొందరు అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారని తెలుగు సినీ నిర్మాతల మండలి విమర్శించింది. జీఓ నెంబరు 35ను కోర్టు రద్దు చేసినా… థియేటర్ల యజమానులను.. కొందరు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని నిర్మాతల మండలి అధ్యక్షుడు నట్టి ప్రసన్న కుమార్ ఆరోపించారు. జగన్ సర్కారు వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.

రాజకీయాలు బయట చూసుకోవాలి కానీ సినిమాలపై ప్రభావం చూపింకూడదని కోరారు. పన్ను కట్టకుంటే చర్యలు తీసుకోండి కానీ.. తనిఖీల పేరుతో.. ఇబ్బందులు పెట్టొద్దని కోరారు. బెనిఫిట్ షోలు వేస్తే, బ్లాక్ టికెట్లు అమ్మితే యాక్షన్ తీసుకోవాలి కాని అనవసరంగా ఒత్తిడి తేవొద్దని సూచించారు. సీఎం జగన్‌కు తెలియకుండా జాయింట్ కలెక్టర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని నట్టి కుమార్ విమర్శించారు.

ధియేటర్‌లకు ఏ ఇబ్బంది వచ్చినా కౌన్సిల్, ఛాంబర్ అందరికీ అండగా ఉంటుందని అన్నారు. కొత్త జీవో వచ్చేదాకా సినిమాని సినిమాలా చూడాలని, రాజకీయాలతో ముడి పెట్టొద్దని కోరారు.

పవన్ కల్యాణ్ స్పీచ్‌పై రాంగోపాల్ వర్మ ట్వీట్

ఆదిపురుష్ లో ప్రభాష్ పాత్ర పేరు రాముడు కాదు

300 కోట్లతో ధనుష్ కొత్త ఇల్లు.. అందుకోసమే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -