Thursday, May 9, 2024
- Advertisement -

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి బాహుబలి సినిమాతో ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి-2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23న  ‘బాహుబలి-2’ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.  ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికార ప్రతినిధి ఐఏఎన్ఎస్ వార్తాసంస్థకు తెలిపారు.

అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా సీక్వెల్ లోని కీలక కంటెంట్ ను ప్రభాస్ పుట్టినరోజునాడు ఆవిష్కరించబోతున్నారు’ అని వివరించారు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ భారీ విజయాన్నిసొంతం చేసుకోవడంతో ‘బాహుబలి-2’పై కూడా భారీ అంచనాలు ఏర్పడాయి.

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్టు చిత్రయూనిట్ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘బాహుబలి’ సినిమా విశేషాన్ని ఒకదానిని ఆవిష్కరించడం చిత్రయూనిట్ గతకొంతకాలంగా ఫాలో అవుతోంది. గతంలో కూడా ప్రభాస్ పుట్టినరోజు వేడుకను సెట్స్ లో నిర్వహించి ఆయనను ఆశ్చర్యంలో ముంచెత్తారు.

Related

  1. ప్రభాస్ ఎలాంటి ఆఫర్ వదులుకున్నాడో తెలుసా?
  2. హమ్మయ్య ప్రభాస్ కి కూడా బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇచ్చారు
  3. ప్రభాస్ కోసం మిస్ ఇండియా ని దించుతున్నారు
  4. మహేష్, ప్రభాస్ ల మీద కామెంట్స్ చేసిన చెర్రీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -