Wednesday, May 8, 2024
- Advertisement -

హమ్మయ్య ప్రభాస్ కి కూడా బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇచ్చారు

- Advertisement -

పోయిన సంవత్సరం విడుదల అయిన సినిమాలలో బాహుబలి డామినేషన్ సంగతి తెలిసిందే. చుట్టపక్కల ఏ సినిమాలు కూడా ఆ చిత్రాన్ని అందుకోలేని విధ్వంసాన్ని సృష్టించింది. ఈ ఏడాది ఇచ్చే అవార్డు వేడుకలు అన్నీ గత ఏడాది సినిమాల లిస్టు లోంచే ఇస్తారు కాబట్టి బాహుబలి – శ్రీమంతుడు సినిమాలు ఫుల్ గా డామినేట్ చేసి పడేశాయి.

మెజారిటీ అవార్డ్ లు ఈ సినిమాలే దక్కించుకున్నాయి. కానీ ఉత్తమ నటుడు కేటగిరీ లో మాత్రం ప్రతీ అవార్డు ఫంక్షన్ లో ప్రభాస్ కి హ్యాండ్ ఇచ్చి మహేష్ చేతిలో పెడుతున్నారు. ప్రభాస్ కు మాత్రం ఎక్కడా ఎవ్వరూ అవార్డివ్వలేదు. ‘బాహుబలి’లో తన కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చినా ప్రభాస్ కు అవార్డు దక్కకపోవడంతో అతడి అభిమానులు నిరాశ చెందారు.

ఐతే ఎట్టకేలకు ప్రభాస్ కు కూడా ఓ అవార్డు వచ్చింది. పీఆర్వో కమ్ ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి ఏటా నిర్వహించే ‘సంతోషం’ అవార్డుల్లో ప్రభాసే గత ఏడాదికి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ఇక మిగతా అవార్డుల విషయానికి వస్తే.. ఉత్తమ నటిగా అనుష్క (రుద్రమదేవి) – ఉత్తమ సహాయనటుడిగా రాజేంద్ర ప్రసాద్ (శ్రీమంతుడు) ఎంపికయ్యారు.

Related

  1. ప్రభాస్ కోసం మిస్ ఇండియా ని దించుతున్నారు
  2. ప్రభాస్ కి ప్రేమకథ చిత్రం కావాలట!
  3. మహేష్, ప్రభాస్ ల మీద కామెంట్స్ చేసిన చెర్రీ!
  4. తెలుగు సినిమాలో మరొక ప్రభాస్ వచ్చేసాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -